రోహిత్ నువ్వే ఇలా ఆడితే.. ఇక జట్టును గెలిపించగలవా?

praveen
రోహిత్ శర్మ పేరు చెప్పగానే.. హిట్ మ్యాన్.. డబుల్ సెంచరీల ధీరుడు.. సిక్సర్ల వీరుడు.. ఇలా ఏదేదో చెబుతూ ఉంటారు అభిమానులు. అయితే స్టార్ ఓపెనర్ గా మాత్రమే కాకుండా అటు ఇప్పుడు టీమిండియా కెప్టెన్గా కూడా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. అంతేకాకుండా అటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ని కూడా ముందుకు నడిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే కెప్టెన్ అవ్వకముందు బాగా రాణించిన రోహిత్ శర్మ ఎందుకో కెప్టెన్సీ ఒత్తిడిలో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

 కాగా ఒకప్పుడు ముంబై ఇండియన్స్ కు మంచి ఓపెనింగ్స్ అందించి భారీ పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ఇప్పుడు మాత్రం తన పేలవ ప్రదర్శన కారణంగా జట్టుకు భారంగా మారిపోతూనే ఉన్నాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. వరుస ఓటములతో సతమతమవుతుంది  ఇలాంటి సమయంలో ఎంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన రోహిత్ శర్మ జట్టును గెలిపించాల్సింది పోయి ప్రతి మ్యాచ్లో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేక తక్కువ పరుగులకే  వికెట్లు చేజార్చుకుంటున్నాడు.

 ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ మరోసారి అందరినీ నిరాశ పరిచాడు. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సమయంలో మొదటి ఓవర్ లో ముఖేష్ చౌదరి బౌలింగ్ చేశాడు  అయితే ఎప్పటిలాగే ఓపెనర్ వచ్చిన రోహిత్ శర్మ మొదటి బంతిని డిఫెండ్ చేశాడు  రెండవ బంతి షాట్ కొట్టి ప్రయత్నంలో చివరికి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇది చూసిన అభిమానులు రోహిత్ శర్మ నువ్వే ఇలా ఆడితే ఇక జట్టును ఏం గెలిపించగలవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: