ఐపీఎల్ : నేడు బిగ్ మ్యాచ్.. ఆ రెండు జట్లకు చావోరేవో?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న బిగ్ మ్యాచ్ జరగబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే దిగ్గజాలుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ కి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే  ఈ మ్యాచును వీక్షించేందుకు అటు ప్రేక్షకులు అందరూ సిద్ధమైపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య ఒక్కసారి కూడా మ్యాచ్ జరగలేదు అని చెప్పాలి. ఇక మరో విషయం ఏమిటంటే ఈ రెండు జట్లు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

 ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడింది ముంబై ఇండియన్స్ జట్టు. 16 మ్యాచ్ లలో కూడా ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. బ్యాటింగ్ విభాగం బౌలింగ్ విభాగంలో చతికిలబడి పోయింది ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు. అదే సమయంలో మరో వైపు ఐపీఎల్ హిస్టరీ లోనే దిగ్గజ కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్లలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. అది కూడా అదృష్టవశాత్తు అన్న టాక్ వుంది. ఈ క్రమంలోనే నేడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది.

 ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ రెండు జట్లకు కూడా నేడు జరగబోయే మ్యాచ్ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అని చెప్పాలి. ఆరు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో కూడా ఓడితే ప్లే ఆఫ్స్ అవకాశాలు మొత్తం మూతపడి పోయినట్లే.. ఇక ఆరు మ్యాచ్ లు ఆడి కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మరీ నేడు జరగబోయే మ్యాచ్లో ఏ జట్టు పై చేయి సాధిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: