షాకింగ్ : స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్?
కానీ వెస్టిండీస్ కెప్టెన్ కిరణ్ పోలార్డ్ మాత్రం 34 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించడం తో అభిమానులు అందరూ షాక్ లో మునిగిపోయారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టులో ఆడుతున్నాడూ కిరణ్ పోలార్డ్. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పొలార్డ్ ఆల్రౌండ్ సామర్థ్యంతో విండీస్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. పవర్ హిట్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఎంతో ఆలోచించిన తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా అంటు చెప్పుకొచ్చాడు. పదేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు నుంచి కూడా వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కోరిక ఉండేది.. 15 ఏళ్లకు పైగా టి20 వన్డేలో వెస్టిండీస్ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించాను.
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా నా జట్టుకు ఎప్పుడూ మద్దతు గా ఉంటాను.. ఇక ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కావాలని నిర్ణయించుకున్నాను అంటు సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ పోస్టులో తెలిపాడు కిరణ్ పోలార్డ్. ఇక 15 ఏళ్లపాటు వెస్టిండీస్ క్రికెట్ లో తనకు మద్దతుగా నిలిచిన క్రికెట్ బోర్డు కి అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్గా ఉన్న పోలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించడం తో వెస్టిండీస్ పరిమిత ఓవర్ల జట్టుకి కొత్త కెప్టెన్ రాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఏది ఏమైనా 34 ఏళ్ల వయసులో పవర్ హిట్టర్ గా పేరుపొందిన కిరణ్ పోలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించడం మాత్రం అందరినీ షాక్ కి గురి చేసింది.