మరీ ఇంత మార్పా.. అతను నా బ్రదర్ అంటున్న దీపక్ హుడా?
ఇలా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గొడవ పడ్డ ఇద్దరు ప్లేయర్లు కూడా ఇప్పుడు కలిసి ఆడుతున్నారు. దీంతో ఇద్దరు వ్యవహార శైలి ఎలా ఉండబోతుందో అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలాంటి సమయంలో మొన్నటికి మొన్న దీపక్ హుడా కృనాల్ పాండ్య మ్యాచ్ గెలిచిన సందర్భంలో ఒకరిని ఒకరు ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇటీవలె దీపక్ హుడా కృనాల్ పాండ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కృనాల్ పాండ్యా తనకు సోదరుడు లాంటివాడు అంటూ దీపక్ హుడా చెబుతూ ఉన్నాడు.
సోదరులు అన్న తర్వాత అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లక్నో జట్టును విజేతగా నిలపడం లక్ష్యంగా ఇద్దరం ఆడుతున్నాం. మెగా వేలం సమయంలో నేను అందుబాటులో లేను అందరిలాగానే హోటల్లో కలుసుకున్నాం. గతంలో జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఒకే జట్టు తరఫున ఆడుతున్న మా ఇద్దరి లక్ష్యం ఒకటే అంటూ దీపక్ హుడా చెప్పుకొచ్చాడు..