శిఖర్ ధావన్.. బ్రేకప్ స్టోరీ.. రిజెక్ట్ చేసిన అమ్మాయికీ ఏం చెప్పాడంటే?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్నాడు శిఖర్ ధావన్ అభిమానులు అందరూ కూడా శిఖర్ ధావన్ నీ గబ్బర్ అని పిలుచుకుంటూ ఉంటారు. టీమిండియాలో కీలక ఆటగాడిగా ఇప్పటివరకు ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు శిఖర్ ధావన్. అయితే ఈ సీనియర్ ప్లేయర్ రియల్ లైఫ్ విషయానికి వస్తే వైవాహిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అయేషా ముఖర్జీకి గత ఏడాది విడాకులు ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన ఒక బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది అయేషా. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆ తర్వాత భర్తతో విడాకులు తీసుకొని పదేళ్లు ఒంటరిగానే ఉంది. అయితే ఆమె హర్భజన్ సింగ్ కి ఫేస్బుక్ ఫ్రెండ్. ఇక ఒకసారి అయేషా ఫోటో చూసిన గబ్బర్ ఒక్కసారిగా ప్రేమలో పడిపోయాడు. ఇక ఆమెకు పెళ్ళయ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు అని తెలిసినా కూడా ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ పెళ్లి చేసుకున్నాడు.

 ఇక ఆ తర్వాత ఏమైందో ఎనిమిదేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెపుతూ విడాకులు తీసుకున్నారు. అయితే ఇలా శిఖర్ ధావన్ విడాకులు తీసుకోవడం మాత్రం సంచలనం గానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇంత వరకు మాత్రమే అభిమానులకి తెలుసు కానీ పెళ్లికి ముందు కూడా శిఖర్ ధావన్ కి ఒక లవ్ స్టొరీ ఉందని తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. అయితే అది బ్రేక్ అప్ లవ్ స్టోరీనట. శిఖర్ ధావన్ ఒకానొక సమయంలో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఇక ఆ అమ్మాయి శిఖర్ ధావన్ ను అంగీకరించకుండా రిజెక్ట్ చేసిందట. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా శిఖర్ధావన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 ఇటీవలే పంజాబ్ టీం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు శిఖర్ధావన్. క్రికెట్ ఆడే కొత్తలో ఒక అమ్మాయిని తెగ ఇష్టపడ్డాను. అమ్మాయికి ప్రపోజ్ కూడా చేసాను. కానీ అమ్మాయి మాత్రం ప్రేమను రిజెక్ట్ చేసింది. అప్పుడు ఆమెతో  ఒక మాట చెప్పా.. నువ్వు కోహినూర్ డైమండ్ ని కోల్పోతున్నావ్.. నీకు అర్థం కావట్లేదు అని ఒక అదిరిపోయే డైలాగులు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: