ఐపీఎల్ 15 విజేత ఈ 3 జట్లలో ఒక్కటే?

VAMSI
ఐపీఎల్ లో మ్యాచ్ లు జరుగుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో టైటిల్ విన్నర్ ఎవరనే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. మాములుగా అయితే ఇపుడున్న 10 ఫ్రాంచైజీలకు సొంత అభిమానులు ఉంటారు. వారు అంతా కూడా ఎవరికి వారు మా ఫ్రాంచైజీ గెలుస్తుంది అనుకోవడం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న పది టీం లలో టైటిల్ గెలిచే అర్హత ఉన్నది ఎవరికో అన్నది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వారిలో ప్రధానంగా వినిపిస్తున్న నాలుగు జట్లు ఇవే. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు టైటిల్ గెలవని జట్టుగా ఉన్న రాయల్ ఛాలంజెర్స్ బెంగుళూరు, ఇక ఐపీఎల్ మొదటి సీజన్ లోనే టైటిల్ కొట్టిన రాజస్థాన్ రాయల్స్ మరియు ఈ సీజన్ తోనే తన ఐపీఎల్ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన గుజరాత్ టైటాన్స్.

ఈ మూడు జట్లకే టైటిల్ గెలిచే సత్తా ఉందని క్రికెట్ వర్గాల్లో కూడా గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బెంగుళూరు మరియు రాజస్థాన్ జట్లు ఎప్పుడూ లేనంతగా పటిష్టంగా ఉన్నాయి. మరియు కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు సైతం అద్భుతమైన ప్లేయర్ లతో ఆకట్టుకుంటోంది. ఏ పరిస్థితుల్లో అయినా జట్టును ఆదుకోగలిగే ప్లేయర్ లు ఉండడం ఈ మూడు జట్ల అదృష్టం. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకుని టైటిల్ ను సాధించాలి అని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఐపీఎల్ టైటిల్ విన్నర్ గా కొత్త జట్టును చూసే అదృష్టం కలుగుతుంది. మరి ఏమి జరుగుతుందో చూద్దాం.

కాగా ఇప్పటి వరకు 13 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఐపీఎల్ లో అద్భుతమైన రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ లాంటి జట్లు తడబడుతున్నాయి. ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. మరి ఈ రోజు అయినా ముంబై ఇండియన్స్ ఖాతా తెరుస్తుందా చూడాలి.  





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: