నాగచైతన్య ఎప్పుడైతే సమంత ను వదిలేసి శోభితని పెళ్లి చేసుకున్నారో అప్పటినుండి ఎన్నో విమర్శలు వచ్చాయి.కానీ ఆ విమర్శలు అన్నింటిని దాటుకొని ఈ మధ్యనే ఈ జంట 1 ఇయర్ యానివర్సరీని జరుపుకున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా శోభిత నాగచైతన్య ఇద్దరు కలిసి నవీన్ పోలిశెట్టి చేస్తున్న ఓ షోకి గెస్ట్లుగా వచ్చారు. అయితే ఇందులో నవీన్ పోలిశెట్టి నాగచైతన్య ఆ పేరుతో పిలవగా..ఆ దరిద్రపు పేరుతో నా భర్తను పిలవకండి అని చాలాసార్లు నొక్కిమరీ చెప్పింది శోభిత. మరి ఇంతకీ నాగచైతన్యను నవీన్ పోలిశెట్టి ఏ పేరుతో పిలిచారు. ఎందుకు శోభిత కోపగించుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన తాజా మూవీ అనగనగా ఒక రాజు.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ "పోలిశెట్టి మీట్స్ పికిల్ బాల్" అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి నాగచైతన్య,శోభితలు గెస్ట్ లుగా వచ్చిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అందులో నాగచైతన్య ని నవీన్ పోలిశెట్టి భీమవరం బాలుమ భాగా బీచ్ పోదామా అనే పాటకి స్టెప్ వేయాల్సిందిగా ఆహ్వానించారు. అయితే పాటకి స్టెప్ వేయాల్సిందిగా కోరిన సమయంలో నాగచైతన్య లేదా చైతన్య, చైతూ అని పిలవకుండా చై అని పిలిచారు.
అయితే ఈ మాట వినడంతోనే శోభిత ధూళిపాళ్ల నా భర్తను చై అనే పేరుతో పిలవకండి. చైతూ అని పిలవండి అని చాలాసార్లు నొక్కి చెప్పింది. దీంతో చాలా మంది నెటిజెన్లు శోభితకు చై అనే పేరు నచ్చడం లేదు కావచ్చు. ఎందుకంటే గతంలో సమంతని పెళ్లి చేసుకున్నాక చాలామంది ఫ్యాన్స్ ఈ జంటని చై సామ్ అని ప్రేమగా పిలుచుకునేవారు. అందుకే ఈ పేరుతో తన భర్తని పిలవకండి అని శోభిత కోపగించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది