అఖండ 2 : వ‌ర‌ల్డ్ వైడ్ డే 1 వ‌సూళ్ల ప్రిడిక్ష‌న్ .. ఎన్ని కోట్లు అంటే... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

భారీ అంచనాలు మ‌ధ్య నంద‌మూరి బాల‌కృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన అఖండ 2 - తాండ‌వం సినిమా థియేట‌ర్ల లోకి వ‌చ్చింది. అఖండ లాంటి బారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాకు సీక్వెల్ కావ‌డంతో ఈ తాండ‌వం థియేట‌ర్ల లో తాండ‌వం ఆడేస్తుంద‌ని చాలా మంది కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దాదాపు వ‌ర‌ల్డ్ వైడ్ గా రు. 115 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే రు. 115 కోట్ల రేంజ్‌లో షేర్ .. రు. 220 కోట్ల రేంజ్  లో గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టాల్సి ఉంటుంది. ఇక అఖండ 2 ఎప్పుడొచ్చినా అదిరే వసూళ్లు ఉంటాయి అని ట్రేడ్ వ‌ర్గాలు ధీమాతో ఉన్నాయి. అందుకు త‌గిన‌ట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ గా న‌మోదు అయ్యాయి.


బాల‌య్య గ‌త నాలుగు సినిమాలు హిట్ అయ్యి .. మంచి ఊపు మీద ఉన్నారు. ఈ క్ర‌మంలోనే బాలయ్య గత సినిమాలు అన్నిటికి మించి ఈ సినిమాకి హైప్ ఉండ‌డంతోవాటికి మించిన హైప్ తో పాటు భారీ వ‌సూల్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. బాల‌య్య వీర‌సింహారెడ్డి ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ గా రు. 54 కోట్లు రాబ‌ట్టింది. ఇక ఈ సంక్రాంతికి వ‌చ్చిన‌ డాకు మహారాజ్ మొదటి రోజు 56 కోట్లకి పైగా అందుకుంది. అయితే అఖండ 2 మాత్రం రు. 60 కోట్లకి పైగా రాబట్టే అవ‌కాశం ఉందంటున్నారు. ఈ లెక్క‌న చూస్తే అఖండ 2 కు ఫ‌స్ట్ డే రు. 60 నుంచి 70 కోట్ల మధ్య ఓపెనింగ్స్ గ్రాస్ పడే అవకాశం ఉంది.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: