అల్లూరి ఘాట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు వీళ్ళే.. ప్రమాదానికి కారణాలివే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరుకు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మారేడుమల్లె ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో మొత్తం తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది చిత్తూరు జిల్లా వాసులే కావడం మరింత విషాదకరం.
ఈ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు, తెనాలికి చెందిన శైలజారాణి, తిరుపతికి చెందిన శ్యామల, పలమనేరుకు చెందిన సునంద, శివశంకర్ రెడ్డి, బెంగళూరుకు చెందిన కృష్ణకుమారి, గిరింపేటకు చెందిన శ్రీకళ, చిత్తూరుకు చెందిన మధు, మురగంపేటకు చెందిన దొరబాబుగా గుర్తించారు.
సమాచారం మేరకు, బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు మొత్తం 35 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారు. వీరంతా భద్రాచలంలోని సీతారాముల దర్శనం పూర్తి చేసుకుని అనంతరం అన్నవరం బయలుదేరగా మార్గమధ్యంలో ఈ ఘోరం జరిగింది.
ఈ రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఆదుకుంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. అలాగే, ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఈ హృదయ విదారక ఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ బస్ యాక్సిడెంట్ లో మృతి చెందిన వాళ్లకు ప్రభుత్వం సహాయం అందిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు