అఖండ 2: బాలయ్య-బోయపాటి కాదు..ధియేటర్స్ లో ఎక్కువుగా మారుమ్రోగుతున్న పేరు ఇదే..!

Thota Jaya Madhuri
అఖండ 2 థియేటర్లలో మొదటి షో మొదలైన క్షణం నుంచి చివరి సీన్ ముగిసే వరకు ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేసిన అంశం ఒక్కటే — తమన్ మ్యూజిక్. సినిమా చూసి బయటకు వస్తున్న ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న పేరు ఇప్పుడు బాలయ్య, బోయపాటి  కాదు… నేరుగా తమన్. తెర మీద హీరో బాలయ్య గర్జన ఎంత శక్తివంతంగా ఉంటుందో, తెర వెనక నుంచి తమన్ అందించిన సంగీతం కూడా అంతే శక్తివంతంగా, అంతే ఉరుములా వినిపించిందని ప్రేక్షకులు ఏకగ్రీవంగా చెబుతున్నారు.అఖండ 2 కి తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రతి ఎక్స్‌ప్లోసివ్ ఎంట్రీకి ఆయన ఇచ్చిన ఎలక్ట్రిక్ బీట్స్, హై ఫైట్‌లకు ఆయన సెట్ చేసిన మాస్ థీమ్‌లు — ఇవన్నీ కలిపి సినిమాకు అదనపు పవర్‌ను ఇస్తున్నాయి. బాలయ్య ఎంట్రీ వచ్చిందంటే థియేటర్ ఒక్కసారిగా షేక్ అయ్యేంత ఎనర్జీ లెవెల్ పెరిగిపోతుందంటే… ఆ హైప్‌కి కారణం తమన్ సౌండే అని చాలామంది అభిమానులు సూటిగా చెప్పేస్తున్నారు.



కొన్ని థియేటర్లలో అయితే స్పీకర్లు అలానే బద్ధలు అవ్వడానికి వచ్చినంతగా వాల్యూమ్ పెంచారట! “ఇంత పవర్‌తో మ్యూజిక్ వేసిన తమన్ నిజంగా వేరే లెవెల్ కంపోజర్” అంటూ ప్రేక్షకులు పిచ్చిగా రియాక్ట్ అవుతున్నారు. పెద్దవాళ్లు కూడా కాళ్లు ఆగక డాన్స్ చేయాలనిపించేలా ఆయన బీట్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు వరుసగా వస్తున్నాయి.బాలయ్య సినిమా అంటే పంచ్ డైలాగ్స్, పవర్‌ఫుల్ యాక్షన్, మాస్ ఎంట్రీలు అన్నీ ఉంటాయి… కానీ ఆ సన్నివేశాల్ని అసలు లెవెల్‌కు తీసుకెళ్లేది తమన్ ఇచ్చే గర్జించే మ్యూజిక్ అని అభిమానులు పదేపదే గుర్తు చేస్తున్నారు.



ఇంతవరకు బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌నే సోషల్ మీడియా తలదన్నేలా డామినేట్ చేస్తుండేది. కాని ఈసారి పరిస్థితి మారిపోయింది. అఖండ 2 రిలీజ్‌తో థియేటర్లలో, సోషల్ మీడియాలో, రీల్స్‌లో, మీమ్స్‌లో — సర్వత్రా తమన్ పేరు మారుమ్రోగుతోంది. ఒక సంగీత దర్శకుడి స్కోర్ ఒక సినిమాను ఎంత లెవెల్‌లో ఎత్తగలదో అని చెప్పే బెస్ట్ ఉదాహరణగా అఖండ 2 నిలుస్తోంది . తన సంగీతంతో రక్తం మరిగించేలా చేసిన తమన్‌కి ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఓపెన్‌గా సెల్యూట్ చేస్తున్నారు.“ఇలాగే బాలయ్య కోసం మరిన్ని లెజెండరీ స్కోర్స్ ఇవ్వాలి”అని ఆయనను కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: