కింగ్స్ vs కింగ్స్.. అందరి చూపు చెన్నై పైనే?
కాగా ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లు కూడా చెరో రెండు మ్యాచ్లు ఆడాయి. అయితే మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ జట్టు మొదటి మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించగా రెండో మ్యాచ్లో మాత్రం ఓటమి చవిచూసింది. అయితే అటు ఐపీఎల్లో దిగ్గజం జట్టు గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం వరుసగా రెండు మ్యాచ్ లలో కూడా ఓటమి పాలు కావడం గమనార్హం. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారిపోయింది. ముఖ్యంగా అందరి కన్ను చెన్నై సూపర్ కింగ్స్ పైన ఉంది అని చెప్పాలి.
ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అని మహేంద్ర సింగ్ ధోనీ ప్రకటించాడు. కొత్త కెప్టెన్గా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. జడేజా కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ అంతకుముందులా బాగా రాణించలేక పోతోంది. ఇక ఇటీవల ఏకంగా 210 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకో లేకపోవడం తీవ్ర స్థాయిలో విమర్శలకి తావిచ్చింది. ఇక ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఓడి పోయి అభిమానులను నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కనీసం మూడో మ్యాచ్లో అయినా విజయం సాధిస్తుందా లేదా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది..