ఐపీఎల్ 2022: డుప్లిసిస్ ను వదులుకుని ధోనీ తప్పు చేశాడా ?
టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ బెంగళూర్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించారు. మొదటి పది ఓవర్లు నెమ్మదిగా సాగిన బెంగళూర్ ఇన్నింగ్స్ తర్వాత సాగిన తీరు చూస్తే ఎవ్వరికీ నమ్మశక్యం కాదు. ముఖ్యంగా బెంగళూర్ కొత్త కెప్టెన్ డుప్లిసిస్ ఆడిన తీరు ఆశ్చర్యకరం. అయితే గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ లో కొనసాగిన డుప్లిసిస్, ఈ సారి జరిగిన మెగా వేలంలో చెన్నై అంటి పెట్టుకున్న ఆటగాళ్ళల్లో డుప్లిసిస్ లేకపోవడం అందరినీ ఎంతగానో షాక్ కు గురి చేసింది. అయినా వేలంలో కూడా దక్కించుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అయితే గత సంవత్సరం ఐపిఎల్ టైటిల్ నెగ్గడంలో డుప్లిసిస్ కీలక పాత్ర పోషించాడు.
రాత్రి డుప్లిసిస్ చెలరేగిన తీరు చూస్తే చెన్నై యాజమాన్యం ఖచ్చితంగా బాధపడి ఉంటుంది. ఈ విషయంలో ఖచ్చితంగా మాజీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని దే తప్పు అని చెప్పాలి. అతని ఆట గురించి బాగా తెలిసిన ధోని వేలంలోనూ కొనడానికి ఆసక్తి చూపకపోవడం దేనికి సంకేతం. ఇప్పుడు అందరూ బాధపడేలా ఇన్నింగ్స్ ఆడాడు. కానీ బౌలర్ల పూర్తి వైఫల్యంతో ౨౦౫ పరుగులు చేసినా మ్యాచ్ ను కాపాడుకోలేకపోయారు.