ఐపీఎల్ : ఒంటరి వాడైనా రోహిత్ శర్మ?

praveen
ప్రస్తుతం టీమిండియా లో మూడు ఫార్మాట్లకు అటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా కూడా రోహిత్ శర్మ పేరు సంపాదించుకున్నాడు. అతి తక్కువ సమయంలో ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్లో టైటిల్ గెలిచిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 15వ సీజన్లో ఆరోసారి టైటిల్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు.

 ఇక అలాంటి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ 15 సీజన్లో మాత్రం ఒంటరి వాడు అయిపోయాడు. అదేంటి రోహిత్ శర్మ జట్టు లో ఎంతో మంది ఉంటారు కదా.. ఇంకా ఒంటరివాడు ఎందుకు అయ్యాడు అని అనుకుంటున్నారు కదా. అయితే రోహిత్ శర్మ ఒంటరివాడు అయింది ఒక ఆటగాడిగా కాదు ఏకంగా టైటిల్ విన్నర్ కెప్టెన్గా ఒంటరి వాడు అయిపోయాడు. ప్రస్తుతం 15వ సీజన్లో ఏకైక విన్నింగ్ కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. ప్రస్తుత సీజన్లో రోహిత్ శర్మ మినహా ఏ ఒక్కరూ కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.

 సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 2020లో ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ గా ఉండగా.. ఇక ఇప్పుడు కోల్కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గా మారిపోయినా శ్రేయస్ అయ్యర్ మినహా ప్రస్తుతం ఏ కెప్టెన్ కూడా కనీసం ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ ఆడింది లేదు. ఇక ఈ విషయం తెలిసిన తరువాత ఈ సారి ముంబై ఇండియన్స్ జట్టుకు తిరుగు ఉండదని అభిమానులు అందరూ కూడా సంతోషంతో మునిగిపోతున్నారు. మొన్నటి వరకు మహేంద్ర సింగ్ ధోనీ తోడు ఉండేవాడు. కానీ ఇటీవలే మహేంద్రసింగ్ ధోని చెన్నై కెప్టెన్గా తప్పుకున్నాడు.

 దీంతో ఐపీఎల్ లో టైటిల్ విజేతగా నిలిచినా కెప్టెన్గా కొనసాగుతున్న ఏకైక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. దీంతో ప్రస్తుతం అందరూ అనుభవంలేని సారథులు ఉన్న నేపథ్యంలో ఇక రోహిత్ శర్మ  ముంబై ఇండియన్స్ కు మరోసారి తనదైన వ్యూహాలతో ముందుకు నడిపించే ఎవరికీ సాధ్యం కాని అంత దూరం లో ఆరవసారి టైటిల్ కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని అటు రోహిత్ శర్మ ఎంత బాగా వినియోగించుకున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: