
వరల్డ్ కప్ 2022: "ఆస్ట్రేలియా"దే టైటిల్... ?
వాటిలో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరియు గత వరల్డ్ కప్ రన్నర్ అప్ ఇండియా లు ఇంకా సెమీస్ కు చేరలేదు. ఇరు జట్లు ఆడబోయే చివరి మ్యాచ్ ఫలితం మీద వీరి సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే వరల్డ్ కప్ కు ముందు వరకు ఇంగ్లాండ్ ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే మళ్ళీ టైటిల్ ఇదే కొడుతోంది అనుకున్నారు. కానీ అంచనాలు అన్నీ తలక్రిందులు అయ్యాయి. వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 11 సార్లలో ఆరు సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇప్పుడు ఏడవసారి టైటిల్ ను సాధించడానికి కసిమీద ఉన్నారు.
ఈ టోర్నీలో అపజయం అన్నది ఎరుగని ఒకే ఒక జట్టుగా దూసుకుపోతోంది. ఆస్ట్రేలియా ఆడిన 7 మ్యాచ్ లలో ఏడూ గెలిచి టైటిల్ కు తాము అన్ని విధాలుగా అర్హులమని ప్రత్యర్థులకు చాటి చెప్పింది. అయితే ఆస్ట్రేలియా టైటిల్ ను సాధించకుండా అడ్డుపడగలిగే జట్టు ఒకటే సౌత్ ఆఫ్రికా. మరి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టే జట్టు ఏదో తెలియాలంటే మరో మూడు మ్యాచ్ లు ముగిసే వరకు వేచి చూడక తప్పదు.