పాపం పాకిస్తాన్.. 20 పరుగుల్లో ఆలౌట్?

praveen
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక పాకిస్థాన్ జట్టులో ఎప్పుడు నిలకడలేని కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అద్భుతంగా రాణిస్తుంది అని పాకిస్తాన్ పై ప్రశంసలు కురిపించే లోపే ఊహించని రేంజిలో చెత్త ప్రదర్శన చేస్తూ ఉంటుంది పాకిస్థాన్ జట్టు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక కచ్చితంగా గెలుస్తుంది అనుకున్న మ్యాచులలో ఓడిపోవడం.. ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లలో అద్భుతమైన విజయాలు సాధించడం లాంటివి పాకిస్తాన్ జట్టు విషయంలో ఎన్నో సార్లు జరిగాయి అని చెప్పాలి.


 ఇటీవలే లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో కూడా పాకిస్తాన్ కేవలం 20 పరుగులు మాత్రమే చేసి ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయింది. 248 పరుగులకు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టంగా కనిపించింది. అయితే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం క్రీజులో ఉండడంతో మరోసారి మంచి ప్రదర్శన చేస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొత్తం ఏకంగా పేకమేడను తలపించింది. 20 పరుగుల వ్యవధిలోనే  ఆరు వికెట్లు కోల్పోయి 268 పరుగులకు ఆలౌటయింది పాకిస్తాన్ జట్టు. దీంతో ఇక తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 123 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.


 అయితే పాకిస్తాన్ పేలవ ప్రదర్శన ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉండడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐదు వికెట్లు తీయగా మిచెల్ స్టార్క్  మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు దక్కాయి. అంతకు ముందు మూడు రోజులు ఓవర్నైట్ లో ఒక వికెట్ కోల్పోయి 90 పరుగుల వద్ద  ఉంది. అయితే ఇక ఈ స్కోరు వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ పెద్దగా రాణించలేక పోయింది అని చెప్పాలి. దీంతో ఇక పాకిస్థాన్ జట్టుపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: