ఐపీఎల్ : ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న వారు వీళ్లే?

praveen
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ఎంతో గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే.  ఐపీఎల్ లో టైటిల్ కొట్టడమే లక్ష్యంగా అన్ని జట్లు కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్. ఇప్పటికే బిసిసిఐ పీపిఎల్ కు సంబంధించి పూర్తి షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఇక ఇప్పటికే అన్ని జట్లు కూడా తమ ప్రత్యర్థులను ఎవరు అన్నదానిపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇక తమ ప్రత్యర్థులను ప్రతి మ్యాచ్లో ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి అన్ని జట్లు. ఇకపోతేమార్చి 26వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అని తెలిసిందే.


 ఐపీఎల్ లో భాగంగా మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది రన్నరప్గా నిలిచిన కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఐపీఎల్ లో 10 జట్లు పాల్గొంటూ ఉండడంతో ఇక రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్ లు నిర్వహించేందుకు బీసీసీఐ సరికొత్త ఫార్మాట్ ను ప్రవేశపెట్టింది. ఇక ఐపీఎల్ ప్రారంభం కోసం  ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా ఎన్నో రోజులు లేని నేపథ్యంలో గతంలో ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ లో నమోదు చేసిన గణాంకాలు ఇప్పుడు వైరల్ గా మారిపోతుంది.


 సాధారణంగా ఐపీఎల్ లో ప్రతీ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవాలని  ప్రతి ఆటగాడు భావిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు గెలుచుకున్న ఆటగాళ్ల లిస్టు ఏంటో తెలుసుకుందాం.. ఐపీఎల్లో 360 డిగ్రీస్ ఆటగాడిగా పేరు సంపాదించుకున్న ఎబి డివిలియర్స్ ఇక 25 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న ఆటగాళ్లలో టాప్ లో కొనసాగుతున్నారు  ఆ తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్  22 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 18 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. డేవిడ్ వార్నర్ 17సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోగా.. మహేంద్ర సింగ్ ధోనీ 17సార్లు మ్యాన్ ఆఫ్ ది  మ్యాచ్ లతో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Man

సంబంధిత వార్తలు: