వరల్డ్ కప్: ఇండియా సెమీస్ ఆశలు ఇంకా పదిలం?

frame వరల్డ్ కప్: ఇండియా సెమీస్ ఆశలు ఇంకా పదిలం?

VAMSI
ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా మహిళల వరల్డ్ కప్ 2022 జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా లీగ్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో నాక్ ఔట్ మ్యాచ్ లకు అర్హత సాధించే జట్లపై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పాయింట్ల పట్టిక ప్రకారం ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లు వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్ కు చేరువయ్యే వారిలో ముందున్నారు. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ ఉండనుంది. అయితే ఈ పోటీ కేవలం మూడు జట్ల మధ్యనే ఉండనున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్, ఇండియా మరియు వెస్ట్ ఇండీస్.

ఈ మూడు జట్లు కూడా కొన్ని సమీకరణాల ప్రకారం మరియు ఇతర జట్ల ఫలితాల ప్రకారం సెమీస్ కు చేరేందుకు అవకాశం ఉంది. అయితే ఇండియా సెమీస్ చేరడానికి ఉన్న అవకాశాలు ఒక్కసారి చూద్దాం.

ప్రస్తుతం ఇండియా 5 మ్యాచ్ లు పూర్తి చేసుకుంది. వాటిలో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలిచి సెమీస్ కు వెళ్లేందుకు అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే ఇండియాకు ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో రెండింటిలోనూ గెలవాలి, అలాగే భారీ రన్ రేట్ ను సాధించాలి. అప్పుడు ఇండియా ఖాతాలో పూర్తి మ్యాచ్ లు ముగిసే సమయానికి 8 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ లు పేలవమైన ఆటతీరును కనబరిచి లీగ్ నుండి అనధికారికంగా దూరం అయ్యారు. దీనితో వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్ మరియు బంగ్లాదేశ్ లో ఇండియాతో పాటు సెమీస్ కు పోటీ పడనున్నాయి. ఇంగ్లాండ్ కూడా 5 మ్యాచ్ లలో 2 గెలిచింది.

కాబట్టి ఇంగ్లాండ్ తాను తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్ లలో ఒక్కటి ఓడిపోయినా మనకు లైన్ క్లియర్ అవుతుంది. ఇక వెస్ట్ ఇండీస్ కు రెండు మ్యాచ్ లు ఉన్నాయి. ఏదైనా ఒకటి గెలిస్తే రన్ రేట్ తో సంబంధం లేకుండా సెమీస్ కు వెళుతుంది. బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ లు గెలిచి ఇండియా కన్నా మెరుగైన రన్ రేట్ సాధిస్తే అప్పుడు బంగ్లా సెమీస్ కు చేరుతుంది. కాబట్టి ముందు ఇండియా సౌత్ ఆఫ్రికా మరియు బంగ్లాదేశ్ లతో గెలవడం పైన దృష్టి పెట్టాలి. అదే సందర్భంలో ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఇండియా సెమీస్ కు చేరుతుంది. మరి ఏమి జరగనుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: