నిరాశలో రిశభ్ పంత్ ఫ్యాన్స్... ఏమైంది అసలు?

VAMSI
ఈ రోజు మొహాలీ వేదికగా ఇండియా మరియు శ్రీలంక మధ్యన రెండు టెస్ట్ లలో భాగంగా మొదటి టెస్ట్ ఆరంభం అయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపాడు. మొదటి పది ఓవర్ లలో శ్రీలంక బౌలర్లకు ఓపెనర్లు చుక్కలు చూపించారు. వన్ డే తరహాలో బ్యాటింగ్ చేశారంటే నమ్మండి. అయితే ఇండియాకు దొరికిన ఆరంభాన్ని రోహిత్ మయాంక్ లు వాడుకోవడంలో విఫలం అయ్యారు. అయితే మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన తెలుగు ఆటగాడు హనుమ విహారి అర్థ సెంచరీ (58) సాధించి ఔటయ్యడు. ఇక 100 వ టెస్ట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతున్నట్లు కనిపించినా స్పిన్నర్ ఎంబుల్ దెనియా బాల్ ను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యి బౌల్డ్ అయ్యాడు.
అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న ఇన్నింగ్స్ లో తుఫాన్ వచ్చినట్లుగా రిషభ్ పంత్  వచ్చాడు. వచ్చీ రాగానే శ్రీలంక స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని అతడు ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ కే హైలైట్ అని చెప్పాలి. రిషబ్ పంత్ శ్రేయాస్ అయ్యర్ మరియు రవీంద్ర జడేజా లతో చేసిన భాగస్వామ్యాలు ఇండియాకు చాలా ముఖ్యం. ఆ దశలో కనుక వికెట్ పడి ఉంటే, ఈ రోజే ఇండియా అల్ అవుట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ రిషబ్ అటాకింగ్ బ్యాటింగ్ కారణంగా ఇండియా మొదటి రోజునే 85 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. మొదటి రోజులో భారత్ ఆటగాళ్లను మరియు రిషబ్ పంత్ అభిమానులను నిరాశపరిచిన విషయమొక్కటే.
రిషబ్ పంత్ సెంచరీని తృటిలో చేజార్చుకోవడం. రిషబ్ పంత్ 97 బంతుల్లో 96 పరుగులు చేసి మంచి ఊపుమీద ఉన్న సమయంలో సురంగ లక్మల్ వేసిన బంతిని అంచనా వేయడంలో బౌల్డ్ అయ్యాడు. పంత్ తన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు మరియు 4 సిక్సర్లు సాధించాడు. దీనితో నాలుగు పరుగుల దూరంలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయితే ఈ ఇన్నింగ్స్ తో మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: