ధోనీ మారిపోయాడు.. కొత్త లుక్ చూశారా?

praveen
ప్రపంచ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎంత మంది స్టార్ ప్లేయర్ లు ఉన్నప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రమే కోట్లలో ప్రపంచ వ్యాప్తం  గా అభిమానులు ఉన్నారు. భారత క్రికెట్ లో ఏ కెప్టెన్ సాధించని విధంగా ఏకంగా మూడు సార్లు ఐసీసీ ట్రోఫీ సాధించిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అయితే మహేంద్ర సింగ్ ధోనీ సాధారణం  గా సోషల్ మీడియా  లో అసలు యాక్టివ్ గా ఉండడు.

 మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఏదైనా పోస్టు వచ్చింది అంటే అది చాలా అరుదుగా మాత్రమే వస్తూ ఉంటుంది. అయితే  ధోని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండక పోయినప్పటికీ ధోని గురించి సామాజిక మాధ్యమాలలో మాత్రం ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ధోని లుక్ కు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నోసార్లు చర్చ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఐపీఎల్ కి ముందు ధోనీ సరికొత్త లుక్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసాడు.

 ఇకపోతే ఇటీవల మెగా వేలం నేపథ్యం లో చెన్నై ఫ్రాంచైజీ తో కలిసి ఆటగాళ్లకు కొనుగోలు చేసే విషయం లో ప్రణాళికలను రక్షించేందుకు ముందు గానే చెన్నై చేరు కున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇప్పుడు ధోని కొత్త లుక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది. ఇక ఇటీవల మహేంద్ర  సింగ్ ధోని చెన్నై సూపర్ కోచ్ ఫ్లెమింగ్ ఫోటోలను ఫ్రాంచైజీ సోషల్ మీడియా లో పంచుకుంది అయితే ఇక ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఫోటోలో ధోని లుక్ సరి కొత్తగా కనిపిస్తుంది. దీంతో ధోనీ మరో కొత్త లుక్ లోకి మారాడు అందరూ అనుకుంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: