తిరుగులేని యష్ దుల్.. అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ?
ఇకపోతే ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా తన ఫస్ట్ క్లాసు కెరీర్ ప్రారంభించాడు. తనకు తిరుగు లేదు అని నిరూపించాడు. ఫస్ట్ క్లాస్ లో అరంగేట్రం మ్యాచ్లోనే ఏకంగా సెంచరీతో దుమ్ము దులిపాడు యష్ దుల్. తన మొదటి మ్యాచ్ ను తన కెరీర్లో ప్రత్యేకమైన మ్యాచ్ గా మార్చుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న రంజీ ట్రోఫీ ఎట్టకేలకు ఫిబ్రవరి 11న ప్రారంభమైంది. ఇటీవల ఢిల్లీ తమిళనాడు జట్ల మధ్య మొదటి మ్యాచ్లో తలపడ్డాయ్. ఢిల్లీ జట్టులో ఆడుతున్న యువ బ్యాట్స్మెన్ 136 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మొత్తంగా 150 బంతులను ఆడిన యష్ దుల్ 113 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇక ఇందులో 18 ఫోర్లు ఉండడం గమనార్హం. తమిళనాడు లాంటి ఒక పటిష్ట జట్టుపై అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టడం తో అభిమానులు అందరూ ఫిదా అవుతున్నారు. దీంతో సీనియర్ ప్లేయర్లు కూడా అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అతనే అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అదృష్టవశాత్తూ తక్కువ ధరకే దక్కించుకుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల జరిగిన మెగా వేలంలో 50 లక్షలకు సొంతం చేసుకుంది ఢిల్లీ.