మెగా వేలం : ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

praveen
ఇటీవలే ఐపీఎల్ మెగా వేలం జరిగింది. ఇక ఐపీఎల్ మెగా వేలంలో అన్ని ఫ్రాంచైజీలు తమ వ్యూహాలకు అనుగుణంగా ఎంతో మంది ఆటగాళ్లను పోటీ పడి మరీ కొనుగోలు చేశాయి. అయితే ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కావడానికి ముందు ఐపీఎల్లో ఉన్న ఎంతోమంది స్టార్ ఆటగాళ్లకు ఊహించని   రేంజ్ లో ధర పలుకుతుంది అని ప్రేక్షకులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కానీ మెగా వేలం ప్రారంభమైన తర్వాత మాత్రం అందరి అంచనాలను తారుమారు అయ్యాయి. వయసు మీద పడుతున్న సీనియర్ ప్లేయర్ ల వైపు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబరచలేదు. జట్టు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీలు తెగ పోటీ పడ్డాయి.

 దీంతో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్ లుగా కొనసాగుతున్న వారిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో ఇక ఎంతో మంది అన్ సోల్డ్ ఆటగాళ్లు గానే మిగిలిపోయారు. ఇక ఇలాంటి సమయంలోనే అటు యువ ఆటగాళ్లు మాత్రం కోట్ల ధర పలికి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా హోరాహోరీగా మెగా వేలం జరుగుతున్న సమయంలో తన చార్మి లుక్ తో ఒక 20 ఏళ్ల యువతి అందరి దృష్టిని ఆకర్షించింది. మెగా వేలంలో ఎంతో చురుకుగా పాల్గొంటూ అందరినీ ఆలోచనలో పడేసింది.

 దీంతో ఈ అమ్మాయి ఎవరా అన్న చర్చ మొదలయింది. అయితే ఇలా మెగా వేలంలో తనలుక్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 20 ఏళ్ల అమ్మాయి ఎవరో కాదు కోల్కతా నైట్రైడర్స్ జట్టు సహా యజమాని బాలీవుడ్ నటి జుహీ చావ్లా కూతురు జాహ్నవి మెహతా. జాహ్నవి విదేశాల్లో డిగ్రీ చేసింది ప్రస్తుతం కోల్కతా నైట్రైడర్స్ జట్టు వ్యవహారాలను చూస్తోంది. ఈ అమ్మాయి మెగా వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఇదే మెగా వేలంలో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా పాల్గొన్నారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: