ఐపీఎల్ మెగా వేలం.. ఆ కెప్టెన్ కి షాక్?

praveen
ఐపీఎల్ అనగానే ప్రేక్షకులందరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. ఏ జట్టు ఎలా రాణిస్తుంది అన్నది తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఐపీఎల్ లో కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇస్తూ ఉండడం అదే సమయంలో మెగా వేలం కూడా నిర్వహిస్తూ ఉండడంతో ఇక ఈ సారి ప్రేక్షకులకు అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. మోన్నటి వరకు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన జట్లు ఈ సారి అద్భుత ప్రదర్శన చేసే అవకాశం లేకపోలేదు. ఇకపోతే ఇటీవల జరిగిన మెగా వేలం విషయంలో కూడా  అభిమానులు కొన్ని అంచనాలు పెట్టుకున్నారు.

 ఐపీఎల్ లో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉండటంతో వాళ్ళని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడి పోయే అవకాశం ఉందని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా స్టార్ ప్లేయర్ రికార్డు స్థాయిలో ధర పలికే అవకాశం ఉందని భావించారు. కానీ మెగా వేలం ప్రారంభమైన తర్వాత అంచనాలు తారుమారయ్యాయి. గత సీజన్లో వరకూ10 కోట్లకు పైగా ధర పలికిన ఎంతోమంది స్టార్ ఆటగాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఫ్రాంచైజీ లు.

 యువ ఆటగాళ్లకు కోట్ల రూపాయలు చెల్లించి జట్టు లోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయ్ అని చెప్పాలి. ఇలా ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించని  వారిలో అటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఉన్నాడు. కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న సమయం లో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అంతే  కాదు కెప్టెన్గా అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్కు ఒక ప్రపంచ కప్ కూడా అందించాడు. రెండు కోట్ల  కనీస ధర తో ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్నాడూ. కానీ ఇతని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. దీంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: