ఐపీఎల్ 2022.. మరో స్టార్ ప్లేయర్ ఔట్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఇది ఒక దేశవాళి క్రికెట్ లీగ్ మాత్రమే.. కానీ విదేశీ క్రికెటర్లకు ఇది ఒక అంతర్జాతీయ మ్యాచ్ కంటే ఎక్కువ.. ఎందుకంటే ఐపీఎల్లో ఒక్కసారి పాల్గొంటే ఊహించనంత అనుభవం వస్తుంది..  కోట్లకి కోట్లు ఆదాయం వెనక్కి వెనకేసుకోవచ్చు.. ప్రతి ఏడాది ఐపీఎల్లో భాగం కావాలని విదేశీ ఆటగాళ్లు భావిస్తూ ఉంటారు.. అప్పుడు వరకు ఐపీఎల్ లో ఆడనివారు అబ్బా ఒక్కసారి ఐపీఎల్ ఆడాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి సీజన్ ఐపీఎల్ కి కొత్త విదేశీ ఆటగాళ్లు ఎంత ఇస్తూనే ఉంటారు.



 కానీ ఇవన్నీ ఒక్కప్పటి మాటలు.. ఇప్పుడు మాత్రం కొత్త ఆటగాళ్లు ఐపీఎల్లో కి ఎంట్రీ ఇవ్వడం కాదు.. ఐపీఎల్లో కొనసాగి 2, 3 సీజన్లలో ఆడి ఐపీఎల్ అసలు సిసలైన మజా ఏంటో తెలిసిన ఆటగాళ్లు సైతం పక్కకు తప్పుకుంటు ఉండటం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇలా ఐపీఎల్లో ఆటగాళ్లు ఒక తప్పుకోవడానికి కారణం కరోనా వైరస్. కరోనా వైరస్ కారణంగా కఠిన నిబంధనల మధ్య బయో బబుల్ పద్ధతిలో ఆటగాళ్లను క్వారంటైన్ లో ఉంచుతు  మాచర్ల మ్యాచ్ లు ఆడిస్తుంది బీసీసీఐ.



 అయితే ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్ లలో కఠిన నిబంధనల మధ్య తీవ్ర ఒత్తిడితో మ్యాచు లు ఆడుతున్న ఆటగాళ్ళు.. ఇప్పుడు ఐపీఎల్ లో కూడా ఇలాంటి పరిస్థితుల మధ్య క్రికెట్ ఆడడానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది క్రికెటర్లు తప్పుకుంటున్నారు.  ముఖ్యంగా ఇంగ్లాండ్ క్రికెటర్లు ఎక్కువగా ఐపీఎల్కు గుడ్ బై చెబుతూ ఉండటం గమనార్హం. ఇప్పటికే జో రూట్, బెన్ స్టోక్స్ ఇలాంటి ఆటగాళ్ళు తప్పుకోక.. ఇప్పుడు మరో స్టార్ ప్లేయర్ జేమిషన్ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కొనసాగుతున్న న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైల్ జెమిషన్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఫ్యామిలీతో సమయం గడపడానికి ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: