ఐపీఎల్ : అతన్ని వదులుకున్నందుకు బాధపడుతున్నాం?

praveen
మొన్నటి వరకు ఐపీఎల్ లో ఏ జట్టు ఎలా ప్రదర్శన చేస్తుంది అన్న దానిపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉండేవి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఐపీఎల్లో జట్లు రాణించడం కూడా చేసేవి. కానీ 2022 ఐపీఎల్ సీజన్ లో మాత్రం ప్రేక్షకుల అంచనాలను తారుమారు అయిపోయాయి. దీనికి కారణం ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇవ్వడమే.. ఐపీఎల్ లోకి లక్నో అహ్మదాబాద్ జట్లు ఎంట్రీ ఇస్తుండటం ఒకటైతే.. మెగా వేలం జరుగుతూ ఉండటం కూడా ప్రేక్షకుల అంచనాలు తారుమారు కావడానికి కారణం అయింది. మొన్నటి వరకూ ఎంతోమంది ప్రతిభగల ఆటగాళ్లతో కొన్ని జట్లూ పటిష్టంగా కనిపించాయి. ఐపీఎల్ లో అద్భుతంగా ప్రస్థానాన్ని కొనసాగించాయ్.

 కానీ ఇటీవలే మెగా వేగం కారణంగా అన్ని జట్లు చీలి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుని ఇక మిగతా అందరు ఆటగాళ్లను ఇష్టం లేకపోయినప్పటికీ మెగా వేలంలోకి వదిలేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అన్ని జట్లు ఎంతో మంది కీలక ఆటగాళ్లను కూడా వదులుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక మెగా వేలంలో మళ్లీ అదే ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం కుదురుతుందా కుదరదా అన్నది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే అటు కోల్కతా నైట్రైడర్స్ జట్టు తమ జట్టులో కీలక బ్యాట్స్మెన్గా ఉన్న యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ ను  మెగా వేలం లోకి వదిలేసింది.

 ఇక తాజాగా ఇదే విషయంపై కోల్కతా నైట్రైడర్స్ జట్టు కోచ్ మెక్కల్లమ్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.   తమ జట్టు శుబ్ మన్ గిల్ ను వదులుకోవడం ఫ్రాంచైజీ కి  పెద్ద దెబ్బే అంటూ వ్యాఖ్యానించాడు. ఫిబ్రవరి లో జరగబోయే మెగా వేలం కోసం తమ జట్టు సన్నద్ధమవుతోంది అంటూ చెప్పుకొచ్చాడు  రిటెన్షన్ విధానం కారణంగా ఎంతోమంది ప్రతిభగల ఆటగాళ్లను కోల్పోవాల్సి వచ్చింది అంటూ తెలిపాడు మెక్కల్లమ్. ముఖ్యంగా గిల్ ను వదులుకోవడం నిరాశపరిచింది. కొన్నిసార్లు జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గిల్ లాంటి ప్రతిభ గల ఆటగాడిని కోల్కతా వదులుకోగా.. ఇటీవల ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన అహ్మదాబాద్ జట్టు 8 కోట్లతో రిటైన్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: