రోహిత్ తో కెప్టెన్సీ కష్టమేన?

praveen
టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ కి వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి ఊహించని షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఇక పరిమిత ఓవర్ల కు కెప్టెన్గా రోహిత్ శర్మను నియమించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి ఒక కెప్టెన్ టెస్ట్ ఫార్మాట్ కి మరో కెప్టెన్ ఉంటే బాగుంటుంది అని  అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం కోహ్లీ కి ఉన్న ఫిట్నెస్ ప్రకారం ఇంకా చాలా రోజుల పాటు టెస్టు కెప్టెన్గా కొనసాగుతాడు అని అందరూ అనుకున్నారు. ఇక వన్డే కెప్టెన్ గా తొలగించారు అనే బాధ ఉన్నప్పటికీ  అన్నింటినీ వదిలేసి సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు కెప్టెన్గా జట్టును ఎంతో బాగా ముందుకు నడిపించాడు. ఇక టీమిండియా ఎంత పోరాటం చేసినా మరోసారి సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ లో ఓడిపోయింది.

 టెస్ట్ సిరీస్ ఓడిపోయిన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే టెస్ట్ కెప్టెన్సీ కి ముగింపు పలుకుతున్నా అంటూ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీంతో ఇక కోహ్లీ తర్వాత టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ ఎవరు అన్నదానిపై ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదే విషయంపై స్పందిస్తూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలే మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ లాగా ఫిట్ గా ఉంటూ అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండే ఆటగాడికి బీసీసీఐ తర్వాత కెప్టెన్గా అవకాశం ఇవ్వాలి అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు

 భారత జట్టును నడిపించాలంటే కెప్టెన్ కి ఫిట్నెస్ ఎంతో ముఖ్యం.. అయితే ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్సీ రేసులో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ముందంజలో ఉన్నాడు. గత కొన్ని రోజుల నుంచి అతని ఫిట్నెస్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది.. ఇటీవల తొడ కండరాలు గాయం కారణంగా సౌత్ ఆఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఇక భవిష్యత్తులో కూడా ఇది పునరావృతం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అతడికి టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే సమర్థవంతంగా ముందుకు నడిపించగలడా అనే అనుమానం కలుగుతోంది. అందుకే టీమిండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోహ్లీ లాగా ఎంతో ఫిట్ గా ఉంటూ సుదీర్ఘకాలంపాటు కెప్టెన్ గా కొనసాగే ఆటగాడిని కెప్టెన్సి ఇస్తే బాగుంటుంది అని సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: