'బిగ్ బాష్' లీగ్ ను కాటేసిన కరోనా... ఇక కష్టమే..!

VAMSI
రెండు సంవత్సరాలుగా కరోనా ఎంత ఇబ్బంది పెట్టిందో తెలిసిన విషయమే. దీని కారణంగా ప్రపంచంలోని అన్ని సంస్థలు తమ కార్యకలాపాలను ఆపుకున్నారు. ఇదే విధంగా క్రీడల మీద కూడా తన జులూం చూపించింది. అందుకే ఈ సంవత్సరం ఐపీఎల్ కూడా వాయిదా పడి రెండు సార్లుగా జరిగింది. ఇలా వాయిదా పడడం వలన బీసీసీఐకి కొన్ని కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఐపీఎల్ లాగే చాలా దేశాలలో వివిధ లీగ్ లు జరగడం మనకు తెలిసిందే. అదే విధంగా ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ ఈ నెల 5 నుండి ప్రారంభం అయింది. నిన్నటి వరకు 26 మ్యాచ్ లు సజావుగానే సాగాయి.

సీనియర్ ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ తో యాషెస్ సిరీస్ లో బిజీగా ఉండగా మిగిలిన ఆటగాళ్లు బిగ్ బాష్ లీగ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ లీగ్ ను యువ ఆటగాళ్లు బాగా ఉపయోగించుకుంటున్నారు. కాగా గత సీజన్ తో పోలిస్తే ఈ సారి విదేశీ ఆటగాళ్ల పార్టిసిపేషన్ తక్కువ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు కరోనా సెగ బిగ్ బాష్ లీగ్ కు కూడా తగిలింది. నిన్నటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిన సిరీస్ ఈ రోజు మధ్యాహ్నం పెర్త్ స్కార్చర్స్ కు మరియు మెల్బోర్న్ స్టార్స్ కి మధ్య జరగాల్సిన 27 వ మ్యాచ్ కరోనా కారణంగా ఈ మ్యాచ్ ను వాయిదా వేస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది.

మెల్బోర్న్ స్టార్స్ కు సంబంధించినా సపోర్టింగ్ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఏ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా తెలిపింది. దీనితో తర్వాత జరగాల్సిన మ్యాచ్ లు అయినా జరుగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతే కాకుండా ఆస్ట్రేలియా లో రోజుకి లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. మరి చూద్దాం ఏమి జరగనుందో.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: