ఇండియాలో ఉన్న ఎవర్గ్రీన్ టాప్ హాట్ టాపిక్ లు రెండే రెండు ఒకటి క్రికెట్ మరొకటి సినిమా....వేటి గురించి అయినా టాపిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ ఈ రెండు అంశాలపై మాత్రం ఎపుడు వార్తలు చర్చల్లో ఉంటాయి. అయితే ఈ రెండూ అంశాలను కలిపి చర్చించుకోవలసి వస్తే ఆ కిక్కే వేరప్పా....పలువురు క్రికెటర్లు హీరోయిన్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇపుడు అలాంటి వారిలో ఈ నలుగురు స్వీట్ కపుల్స్ గురించి తెలుసుకుందాం.
* ఇండియా బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్, ఒకప్పుడు బ్రిటిష్ మోడల్‌గా, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా పలు భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హజెల్ కీచ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పరిచయం గురించి హాజెల్ కీచ్ గురించి యువరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి ప్రపోజ్ చేయడానికి ఏడాది పట్టిందని అప్పటి జ్ఞాపకాలను చెప్పుకొచ్చారు. వీరి ఎంగేజ్మెంట్ ఎంతో స్పెషల్ గా 2015లో బాలిలోని బీచ్లో జరుగగా, 2016లో వివాహం చేసుకుని ఒకటయ్యారు.
* భారత్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట 2013లో ఒక షాంపూ యాడ్ లో కలిసిన వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఇద్దరి మధ్య మస్పర్దలు వచ్చినా మళ్ళీ తమ ప్రేమ బంధం బలమైనది అని నమ్మి 2017 లో వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి పెళ్లి ఇటలీలో ఎంతో వైభవంగా జరిగింది.
* ఇండియన్ మోడల్ మరియు జాతీయ స్థాయి అథ్లెట్ అయిన సాగరికను భారతీయ బౌలర్ జహీర్ ఖాన్ ప్రేమించి 2017 లో వివాహం చేసుకున్నారు.
* భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ బాలీవుడ్ నటి గీతా భస్రాను ప్రేమించి 2015 లో పెళ్లి చేసుకున్నారు.
ఈ విధంగా ఎందరో క్రీడాకారులు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నా వివిధ కారణాలతో మధ్యలో విడిపోయారు. కానీ ఈ జంటలు మాత్రం ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నారు.