ఇండియా vs సౌత్ ఆఫ్రికా.. మ్యాచ్ కి ముందే ఊహించని షాక్?

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే సౌత్ ఆఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు అసలు ee టూర్ ఉంటుందా లేదా అని అందరూ అనుమానపడ్డారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఓమిక్రాన్ కు కేంద్రంగా మారిపోయింది సౌత్ఆఫ్రికా. అక్కడ భారీగా ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో రిస్కు చేసి బీసీసీఐ ఆటగాళ్లను సౌత్ ఆఫ్రికా పర్యటనకు పంపిస్తుందా లేదా అన్న దానిపై అనుమానాలు నెలకొనగా ఎట్టకేలకు సౌత్ ఆఫ్రికా పర్యటనకు టీమిండియాను  పంపించగా.. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు సౌతాఫ్రికాలో క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.



 ఇక డిసెంబర్ 26వ తేదీ నుంచి సౌత్ ఆఫ్రికా టీమిండియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో గెలవాలని అటు టీమిండియా పక్కా ప్లాన్ తో బరిలోకి దిగబోతోంది. అయితే ఓ వైపు ఓమిక్రాన్ కేసులు భయపెడుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 5
62,000 దాటిపోయింది . అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఇక భారత్ సౌతాఫ్రికా మధ్య జరగబోయే మ్యాచుల పై కీలక నిర్ణయం తీసుకుంది. తొలి టెస్ట్ మ్యాచ్ ను ఖాళీ స్టేడియంలోనే జరపాలని నిర్ణయించింది.



 అభిమానులను ఎవ్వరిని కూడా అనుమతించబోమని అంటూ తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఓమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు గుంపులు గుంపులుగా వస్తే వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అంటూ సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. ఇలా మొదటి మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను విక్రయించ కూడదు అని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే మొదటి మ్యాచ్ వరకే ఈ నిర్ణయం తీసుకున్నామని జనవరి 3వ తేదీన జరగబోయే రెండో టెస్టు మ్యాచ్ లో ప్రేక్షకులను అనుమతించడం పై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు అంటూ సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుకు చెప్పుకొచ్చింది. ఇక సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయం తో ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: