వైరల్ : కెప్టెన్ అయ్యుండి.. బ్యాగ్ మోసుకెళ్లిన కోహ్లీ?

frame వైరల్ : కెప్టెన్ అయ్యుండి.. బ్యాగ్ మోసుకెళ్లిన కోహ్లీ?

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు టెస్టుల సిరీస్ ఆడుతుంది. అయితే ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ జట్టు టెస్ట్ సిరీస్ ఆడింది టీమ్ ఇండియా జట్టు. టెస్టు సిరీస్లో ఘనవిజయాన్ని సాధించింది..  ఈ క్రమంలోనే ప్రస్తుతం వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది టీమిండియా. ఇటీవల సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా కూడా టెస్టు సిరీస్ గెలవాలని భావిస్తోంది. అయితే ఇక సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ ప్రస్తుతం టీమిండియాకు గొప్ప రికార్డు సృష్టించేందుకు మంచి అవకాశంగా మారిపోయింది.


 ఇప్పటివరకూ టీమిండియా జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ సేన కు ఇక టెస్టు సిరీస్ గెలిస్తే మాత్రం భారత క్రికెట్ లో కొత్త రికార్డు సృష్టించినట్లు అవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రత్యేకమైన విమానంలో సౌత్ ఆఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా క్వారంటైన్  పూర్తిచేసుకుని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. సెంచరియన్ వేదికగా డిసెంబర్ 26వ తేదీన తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓవర్ లోడ్ కిట్ బ్యాగు మోసుకుని ప్రాక్టీస్ కు వెళ్ళిన ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 దీనికి సంబంధించిన వీడియోని కూడా అటు బీసీసీఐ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ఇక ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. అంత హెవీ బ్యాగ్ లో విరాట్ కోహ్లీ అసలు ఏం తీసుకెళ్లాడు అంటూ ప్రస్తుతం అభిమానులు తెగ ఆలోచనలో పడిపోయారు. అయితే తాను సుదీర్ఘ పర్యటనకు వెళ్లినప్పుడు 10 బ్యాట్లు, 10 గ్లౌజ్ సెట్ తీసుకు వెళతాను అంటూ గతంలో విరాట్ కోహ్లీ పలుమార్లు తెలిపాడు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ నివేదికగా 153 పరుగులు సాధించాడు. ఇక ఇప్పుడు తొలి టెస్ట్ మ్యాచ్ కూడా ఇదే వేదిక జరుగుతూ ఉండటంతో కోహ్లీ ఈసారి కూడా అద్భుతంగా రాణించాలని అభిమానులు భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: