ఇక నువ్వు మారవా.. మళ్లీ అదే తప్పు చేసిన క్రికెటర్?

praveen
ఎవరైనా ఆటగాడు క్రికెట్లో విఫలమయ్యాడు అంటే చాలు అతనిపై ట్రోల్స్ వస్తూ ఉంటాయి. అదే రెండు మూడు సార్లు విఫలమయ్యాడు అంటే అది సోషల్ మీడియాలో ఎంత ఆడుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇంగ్లాండు ఓపెన్ రోర్ బర్న్స్ కూడా అలాగే సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఆస్ట్రేలియా మధ్య ఎంతో ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే.  తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్కు ఓపెనర్ రోర్ బర్న్స్ తొలి ఇన్నింగ్స్ లోని గోల్డెన్ డక్ ఔట్ వెనుదిరిగాడు.

 సరేలే ఏదో ఒకసారి అలా జరుగి ఉంటుంది ఇక రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతంగా రాణిస్తారు  అని అందరూ అనుకున్నారు. రెండో ఇన్నింగ్స్లో భారీ అంచనాల మధ్య ఓపెనర్గా బరిలోకి దిగి కేవలం 13 పరుగులు మాత్రమే చేసి వికెట్లు చేజార్చుకున్నాడు. ఆ తర్వాత తక్కువ పరుగులకే ఇంగ్లండ్ జట్టు సరిపెట్టుకోవడం తో ఓటమిపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవలే అడిలైడ్ వేదికగా మొదలైన పింక్ బాల్ టెస్ట్ లో కూడా రోర్ బర్న్స్  మళ్ళీ ఇదే తప్పు చేయడం గమనార్హం. ఓపెనర్ గా భారీ అంచనాలతో బరిలోకి దిగి మళ్లీ విఫలం అయ్యాడు.

 ఆస్ట్రేలియా 473 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలోనే బరిలోకి దిగింది ఇంగ్లాండ్ జట్టు. అయితే నాలుగు పరుగులు మాత్రమే చేసిన రోర్ బర్న్స్ మూడో ఓవర్లోనే వికెట్ చేజార్చుకోవటం గమనార్హం. ఇక అటు వెంటనే మరో ఓపెనర్  కూడా అవుట్ కావడంతో ఇక ఇంగ్లాండ్ జట్టు 12 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే వరుసగా మ్యాచ్ లలో విఫలమవుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్ రోర్ బర్న్స్ పై ట్రోల్స్ కురిపిస్తున్నారు. కనీసం రెండో టెస్టులో అయినా గాడిన పడతాడు అనుకుంటే మళ్లీ అదే ఆటతీరుతో నిరాశపరిచాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక ఇటీవల రోర్ బర్న్స్ అవుటైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: