కెప్టెన్గా కోహ్లీ కెరియర్లో.. అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇవే?

praveen
ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియాలో 3 ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఇప్పటికే టీమిండియాలో కీలక బ్యాట్స్మెన్గా  కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.. తనదైన శైలిలో అద్భుతంగా రాణిస్తూ ఎప్పుడు జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి  మరింత దూకుడుగా ఆడుతూ అటు టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు టి20 వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. వన్డే టెస్టులకు కెప్టెన్గా కొనసాగుతాను అంటూ ప్రకటించాడు.. అయితే ఇటీవలే ఇటువంటి కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రకటించిన బీసీసీఐ.. వన్డే కెప్టెన్సీ నుంచి కూడా విరాట్ కోహ్లీ ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్కు కేవలం ఒక కెప్టెన్ ఉంటే బాగుంటుంది అంటూ బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొద్ది నెలల పాటు కెప్టెన్గా టీమిండియాకు సేవలు అందించిన విరాట్ కోహ్లీ బిసిసిఐ ధన్యవాదాలు తెలిపారు. కోహ్లీ కెరియర్ లో ఆడిన గొప్ప ఇన్నింగ్స్ లను బీసీసీఐ అధికారి ట్విటర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.

 2017లో ఇంగ్లాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. మొదటి వన్డేలో కెప్టెన్గా కోహ్లీ 122 పరుగులు చేసి అద్భుత శతకంతో అదరగొట్టాడు. ఇది విరాట్ కోహ్లీ కెరియర్ లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ గా నిలిచిపోయింది. ఇక 2018లో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో కూడా కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఐదు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్లో ఏకంగా 107 బంతుల్లో 140 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు విరాట్ కోహ్లీ. ఇక ఇదే మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ 117 బంతుల్లో 152 పరుగులు చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. ఇక ఈ సిరీస్ను 3-1 తేడాతోతేడాతో టీమిండియా కైవసం  చేసుకుంది. ఇలా బిసిసిఐ విడుదల చేసిన వీడియోల మీరు కూడా చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: