పాపం కోహ్లీ. ఏడ్వలేక నవ్వు?
కానీ ఊహించని విధంగా మొదటి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. డగౌట్ అయ్యి పూర్తిగా నిరాశపరిచాడు. అజాజ్ పటేల్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యు గా వెనుతిరిగాడు విరాట్ కోహ్లీ. దీంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ ఉన్న జోరు చూస్తే సెంచరీ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ కోహ్లీ వికెట్ కోల్పోయిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట లో భాగంగా 84 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ 36 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రచిన్ రవీంద్ర వేసిన బౌలింగ్లో వికెట్ కోల్పోయాడు విరాట్ కోహ్లీ.
అయితే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ రెండవ టెస్ట్ మ్యాచ్లో వికెట్ కోల్పోయిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక అలా వికెట్ కోల్పోవడంతో అటు విరాట్ కోహ్లీ సైతం షాక్ అయ్యాడు. దీంతో ఏడవలేక చివరికి నిరాశతో నవ్వుతూ పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయిన సందర్భంలో కివీస్ జట్టు సంబరాల్లో మునిగి పోయింది.