ప్రపంచ కప్ సమరం: పాక్ "జోరు" ముందు వీళ్ళు నిలిచేనా?
ఒకవేళ ఇదే విధంగా ఇండియాతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు బరిలో ఉన్న మొత్తం జట్లలో పాకిస్తాన్ అన్ని విభాగాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. కానీ నమీబియాను అంత తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదు. బ్యాటింగ్ లో కొంచెం తడబడుతున్నా బౌలింగ్ మాత్రం కట్టుదిట్టంగా ఉందన్న విషయం తెలుస్తోంది. లక్కీగా పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఈ అవకాశాన్ని నమీబియా టీం ఉపయోగించుకోవలసిన అవసరం ఉంది. పాక్ ను అతి తక్కువ స్కోర్ కు కట్టడి చేసి ఎలాగైనా ఆ స్కోర్ ను చేధించగలిగితే అదే వరల్డ్ కప్ కొట్టినంత పేరును నమీబియాకు తీసుకొస్తుంది.
అయితే ప్రస్తుతం అతి భీకరంగా ఉన్న పాక్ ను తక్కువ స్కోర్ కు నమీబియా కట్టడి చేయగలదా అన్నది సందేహమే. అయితే ఎవరి గేమ్ ఏ రోజు ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేము. ఏమీ సంచలనం జరగొచ్చు చెప్పలేము. ఏది ఏమైనా ౧౫౦ లోపు చేజింగ్ చేయగలదు. అంతకు మించి అంటే కష్టమే. మరి ఏమి జరుగుతుందో చూడాలి.