ఎంఎస్ ధోని షాకింగ్ నిర్ణయం.. అయోమయంలో ఫాన్స్?

praveen
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ ప్రతి సీజన్ కూడా అంత కంతకు క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి సీజన్ కూడా సరికొత్త రీతిలో బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. టీమిండియాలో అవకాశం దక్కించుకోవాలి అనుకున్న ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక మంచి ఫ్లాట్ఫామ్ గా మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం ఐపీఎల్లో ఎనిమిది జట్లు కొనసాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రతి సీజన్లో కూడా ఈ ఎనిమిది జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతూనే ఉంటుంది.

 ఇకపోతే వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ఇక క్రికెట్ మజా ని మరింత పెంచేందుకు కొత్తగా మరో రెండు జట్లను ఐపీఎల్లో తీసుకువచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది బిసిసిఐ. అయితే ఈ రెండు జట్లకు కూడా ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు మెగా వేలం నిర్వహించడానికి బిసిసిఐ నిర్వహించింది. కాగా  ఇక బిసిసిఐ నిర్వహించబోయే ఈ మెగా వేలంలో ఆటగాడు ఏ జట్టులోకి వెళ్ళిపోతున్నాడు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే అన్ని జట్ల ప్రాంఛైజీలు కూడా కొంత మంది ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

 అయితే అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. అయితే తాను కేవలం ఒక్క ఐపీఎల్ సీజన్ మాత్రమే కెప్టెన్ గా ఉంటాను అంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. అయినప్పటికీ తాము ఎమ్మెస్ ధోనీ ని మొదట రిటైన్ చేసుకునే ఆటగాడిగా ఎంపిక చేసుకుంటామంటూ ప్రకటించింది సిఎస్ కే ప్రాంచైజీ. అయితే ఇటీవల సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనను రిటైన్ చేసుకోవద్దని యాజమాన్యానికి సూచించాడట. రిటన్ చేసుకుని డబ్బులు వృధా చేసుకోవద్దని ధోని అన్నట్లు ఫ్రాంచైజ్ యజమాని శ్రీనివాసన్ తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఆటగాడికి దాదాపు 16 కోట్ల రూపాయలను ఫ్రాంచైజీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఏం జరగబోతోంది అన్నదానిపై అభిమానుల్లో అయోమయం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: