ఆఫ్ఘన్ పై స్కాట్లాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

VAMSI
నేడు రెండు చిన్న టీం ల మధ్య సూపర్ 12 మ్యాచ్ జరగనుంది. తర్వాత స్టేజ్ కు వెళ్లాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క మ్యాచ్ ను ఈజీగా తీసుకోకూడదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే నిన్న దాయాదుల మధ్య జరిగిన ప్రపంచ కప్ పోరు. నిన్న పాక్ తో ఓడిన ఇండియా కు తర్వాతా మ్యాచ్ లలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ప్రతి మ్యాచ్ గెలవడం ప్రధానం. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో వున్న జట్లలో ఒక జట్టేమో చిన్న జట్లకు పెద్దన్న ఆఫ్ఘనిస్తాన్. మరొక జట్టేమో క్వాలిఫైయర్ మ్యాచ్ లలో తానాడిన మూడు మ్యాచ్ ల్లోనూ అద్భుతమైన ప్రదర్శన చేసి పెద్ద టీం లకు సైతం సవాల్ చేయగల జట్టు స్కాట్లాండ్.
మొదట టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ బ్యాటింగ్ తీసుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు మ్యాచ్ జరుగుతూఛ్న్నది షార్జా లో కాబట్టి ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసే వారికి అనుకూలంగా ఉంటుందని ఐపీఎల్ మ్యాచ్ ల ద్వారా తెలిసింది. అయితే ఈసె విధంగా అనుకుని ఆదివారం మ్యాచ్ లో బంగ్లాదేశ్ మోసపోయింది. ఇక్కడ 171  పరుగులు చేసినా ఆ స్కోర్ ను కాపాడుకోలేక శ్రీలంక చేతిలో ఓటమి పాలయింది. మరి ఈ రోజు ఏమి జరుగనుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.  అయితే గతంలో ఆఫ్గనిస్తాన్ చేతిలో దారుణమైన రికార్డు స్కాట్లాండ్ కు ఉంది. ఇప్పటి వరకు ఆఫ్గనిస్తాన్ తో స్కాట్లాండ్ ఆడిన 6 మ్యాచ్ లలో ఒక్కటి కూడా గెలిచింది లేదు.
మరి దాదాపు అయిదేళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరూ తలపడుతున్నారు. అన్ని విభాగాలలో స్ట్రాంగ్ గా ఉన్న ఆఫ్ఘన్ జట్టును స్కాట్లాండ్ ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా ఓటముల రికార్డును 7-0 గా మార్చుకుంటుందా అన్నది తెలియాలంటే ఇంకొంతసేపు ఆగాల్సిందే. ఇప్పుడు స్కాట్లాండ్ ఉన్న ఫామ్ లో ఆఫ్ఘన్ ను ఓడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి క్రికెట్ లో ఏమైనా జరగొచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: