తేలిపోయిన సౌత్ ఆఫ్రికా... ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం

M Manohar
ఐసిసి టీ20 ప్రపంచ కప్ సూపర్ 12 స్టేజ్ ఈ రోజు ప్రారంభమైంది. అందులో భాగంగా మొదటి మ్యాచ్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా జట్టు అనుకున్న విధంగానే సౌతాఫ్రికా జట్టును కట్టడి చేసింది. సౌతాఫ్రికా జట్టుకు మంచి ఆరంభం దొరకలేదు. రెండవ ఓవర్లోనే జట్టు కెప్టెన్ కేవలం 12 పరుగులు చేసి కెప్టెన్ బావుమా ఔట్ కాగా... మూడో వారంలో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ 7 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఆ వెంటనే కేవలం రెండు పరుగులు చేసి వాన్ డెర్ డస్సెన్ అవుటయ్యాడు. దాంతో సౌత్ ఆఫ్రికా జట్టు 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన మార్క్రమ్ 36 బంతుల్లో 40 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. క్లాసెంక్ 13 బంతుల్లో 13 పరుగులు చేయగా... మిల్లర్ 18 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసాడు. కానీ మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. చివర్లో రబాడా 19 పరుగులు చేయడంతో సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 118 పరుగులు మాత్రమే చేసింది.
ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజెల్వుడ్, స్టార్క్, స్పిన్నర్ ఆడమ్ జంపా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా.. గ్లేన్ మాక్స్వెల్, కమిన్స్ ఒక్కో వికెట్ ను పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా జట్టు కేవలం 119 పరుగులు చేస్తే సరిపోతుంది. అంటే ఆసీస్ ఆటగాళ్లు ఒక్కో బంతికి ఒక్కో పరుగు చేసిన చివరి బంతి మిగిలి ఉండగానే విజయం సాధిస్తారు. అయితే చూడాలి మరి మరి ఐసీసీ ప్రపంచకప్ 2021 ఆరంభ పోరులో ఎవరు విజయం సాధిస్తారు అనేది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: