గంభీర్ చెప్పిన మాటకు.. ధోని ఫాన్స్ ఫుల్ హ్యాపీ?

praveen
క్రికెట్ ప్రేక్షకులందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్ లో ఐపీఎల్ టైటిల్ విజేత ఎవరో తెలియ నుంది.  ఈ క్రమంలోనే ప్రస్తుతం టైటిల్ కోసం నాలుగు జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి. మొన్నటి వరకూ ప్లే ఆఫ్ లో అర్హత సాధించేందుకు అన్ని జట్లు కూడా ఎంతో రసవత్తరంగా పోటీ కొనసాగించాయి. ఇక చివరికి ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, జట్టు కోల్కతా నైట్రైడర్స్ జట్టు ప్లే ఆప్ కి అర్హత సాధించాయ్ అనే విషయం తెలిసిందే.  ఇక ఇటీవలే మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

 ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు సాగిన మ్యాచ్లో ధోనీ మరోసారి అద్భుతంగా రాణించాడు అని చెప్పాలి.  కాగా నేడు జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ప్రస్తుతం ఐపీఎల్ పోరు ఎంత ఉత్కంఠభరితంగా మారిపోయిన సమయంలో..  ఇటీవలే గౌతం గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బెస్ట్ కెప్టెన్ ఎవరు అనే దాని పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  ప్లే ఆఫ్ చేరిన 4 జట్లలో బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పేసాడు.

 ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఒత్తిడిని తట్టుకునే మహేంద్రసింగ్ ధోని బెస్ట్ కెప్టెన్ అంటూ తెలిపాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కి అశ్విన్ అండదండలు ఉన్నాయని ఇక సారథిగా ఇదే చివరి సీజన్ కావడంతో కోహ్లీ తన కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు గౌతం గంభీర్. అదేసమయంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పై మాత్రం అటు గౌతం గంభీర్ పెదవి విరవడం గమనార్హం. ఎప్పుడు మహేంద్రసింగ్ ధోని పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి అయ్యే గౌతం గంభీర్ ఎట్టకేలకు ఇప్పుడు ధోనినే బెస్ట్ కెప్టెన్ అని ఒప్పుకోవడం తో ఫ్యాన్స్ అందరూ కృషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: