ప్రాంక్ వీడియోతో భార్య‌ను భ‌య‌పెట్టిన క్రికెట‌ర్

N ANJANEYULU
ఓ ప్రాంక్ వీడియో తో త‌న భార్య‌ను తెగ భ‌య‌పెట్టాడు. అంతేకాదు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో  ఎంతో మంది నెటిజ‌న్ల మ‌న్న‌న‌లు పొందుతుంది. ఇంత‌కు ఆ వీడియో పెట్టింది ఎవ‌రంటే స్టార్ క్రికెట‌ర్, ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ టీమ్ కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ‌.  ముంబై ఇండియన్స్ టీమ్‌కు 2021 ఐపీఎల్ అంత‌గా క‌లిసి రాలేదు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడిన టీమ్ కేవ‌లం 5 మ్యాచ్‌ల‌లోనే విజ‌యం సాధించింది. ప్లే ఆఫ్ కు కొంచెం దూరంగానే ఉంద‌ని చెప్పాలి. ఈరోజు జ‌రిగే మ్యాచ్ ముంబై ఇండియ‌న్స్ కు చాలా కీల‌కంగా మార‌నుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోయిన‌ట్ట‌యితే టోర్న‌మెంట్ నుంచి నిష్క‌మించాల్సి వ‌స్తుంది.
ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ క్రికెట్ మ్యాచ్‌లు లేన‌ప్పుడు అప్పుడ‌ప్పుడు స‌ర‌దాగా గ‌డుపుతుంటాడు. త‌న తోటి ఆట‌గాళ్లు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. తాజాగా భార్య రీతిక స‌జ్దే ను ఓ ప్రాంక్ వీడియోతో  భ‌య‌బ్రాంతుల‌కు గురి చేశాడు రోహిత్ శ‌ర్మ‌. అంత‌టితో ఆగ‌కుండా ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప‌లువురు నెటిజ‌న్ల హృద‌యాల‌ను సైతం దోచుకున్నాడు.  రోహిత్‌శ‌ర్మ తానే స్వ‌యంగా వీడియోను చిత్రీక‌రించాడు. రోహిత్ మొద‌ట త‌న చేతిలో ఒక చాక్లెట్‌ను పిడికిలో ఉంచుకొని వేరే రూంలో ఉన్న త‌న భార్య రీతిక వ‌ద్ద‌కు వెళ్లాడు. నా పిడికిలిలో ఏముందో చూడాల‌ని భార్య‌ను అడిగాడు. ఏదో భ‌య‌ప‌డే వ‌స్తువు ఉంద‌ని భార్య భ‌య‌ప‌డి పిడికిలిని ఓపెన్ చేయ‌డానికి నిరాక‌రించింది. రోహిత్ ఎంత బ‌తిమిలాడినా ఆమె ఓపెన్ చేయ‌లేదు.
చివ‌ర‌కు హిట్‌మ్యాన్ ఆస‌స్పెన్స్‌ను ఓపెన్ చేశాడు. అందులో చాక్లెట్ చూసి రీతిక తెగ న‌వ్వింది. ఈ వీడియోను రోహిత్ శ‌ర్మ  సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి  అభిమానుల‌తో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం వీరు యూనైటెడ్ అర‌బ్  ఎమిరేట్స్‌లో ఉన్నారు. ఐపీఎల్ కోసం త‌న ఫ్యామిలీతో పాటు అక్క‌డ ఉన్నాడు రోహిత్‌. ముంబై త‌ప్ప‌కుండా గెల‌వాల్సిన మ్యాచ్‌లో నేడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను ఢీ కొట్ట‌నుంది. ముంబై  ప్లే ఆప్స్‌లో త‌న బెర్త్ ను ఖ‌రారు చేసుకోవాలంటే త‌ప్ప‌కుండా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగే మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించాలి. అప్పుడే ముంబై ప్లే ఆప్స్‌కు అడుగు పెట్ట‌డానికి వీలుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: