కోహ్లీని వెనక్కి నెట్టిన పాకిస్తాన్ కెప్టెన్.. అరుదైన రికార్డు?

praveen
టి20 ఫార్మాట్ ను పొట్టి క్రికెట్ అని ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ప్రేక్షకులు.  క్రికెట్లో వన్డే టెస్టు ఫార్మాట్ లాంటివి ఉన్నప్పటికీ ఎక్కువగా క్రికెట్ ప్రేక్షకులు ఇష్టపడేది మాత్రం టీ-20 ఫార్మెట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక ఈ ఫార్మాటు మొత్తం ఆటగాడి ప్రతిభకు సవాలుగానే మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే తక్కువ సమయంలో తక్కువ ఎక్కువ పరుగులు రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. అందుకే మైదానంలోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సిక్సర్ 4 ఫోర్లతో రెచ్చి పోతూ ఉంటాడు.  దాదాపుగా టి20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో సింగిల్స్ అసలే కనిపించవు అని చెప్పాలి.

 ఇకపోతే ఎంతో మంది ఆటగాళ్లు టీ-20 ఫార్మెట్లో అదరగొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకుంటూ ఉంటారు.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచ మేటి బ్యాట్స్మెన్లలో ఒకరుగా కొనసాగుతున్నాడు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్. అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు.  అద్భుతమైన బ్యాటింగ్తో వరుసగా రికార్డులు కొల్లగొడుతూ దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల టీ-20 ఫార్మెట్లో ఒక అరుదైన రికార్డును సాధించాడు.  ఇటీవల సాధించిన సరికొత్త రికార్డు తో ఏకంగా ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టాడు. అంతే కాదు యూనివర్సల్ బాస్ గా ఉన్న పరుగుల వీరుడు క్రిస్ గేల్ ను సైతం దాటుకుని వెళ్ళాడు బాబర్ అజామ్ .

 పాకిస్తాన్ జట్టు కెప్టెన్గా ఉన్న బాబర్ అజమ్ టి20 లో అందరి కంటే వేగంగా ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌత్ పంజాబ్ జట్టు తన సెంట్రల్ పంజాబ్ జట్టు తో ఆడింది.  ఇక ఈ మ్యాచ్ లో ఈ అరుదైన ఫీట్ సాధించాడు బాబర్ అజామ్. అయితే ఇప్పటి వరకు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ గేల్ పేరు మీద ఉండేది. 192 ఎన్నికల్లో క్రిస్ గేల్ టీ-20 ఫార్మెట్లో ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 212 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయిని అందుకున్నాడు.  ఇటీవలే పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ 187 ఇన్నింగ్స్ ఈ ఘనత సాధించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: