ఢిల్లీ vs ముంబై.. హెడ్ టు హెడ్ గణాంకాల ఇవే?
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఐపీఎల్ మరింత రసవత్తరంగా మారిపోయింది. కాగా నేడు డిఫెండింగ్ చాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ ఢిల్లీ కాపిటల్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండవ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్ తర్వాత ఎక్కువ విజయాలు సాధించిన జట్టు గా ఉంది. ఇక గత రెండు సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ మాత్రం ఈసారి పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఇకపోతే నేడు ముంబై, ఢిల్లీ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక ఈ రెండు జట్ల పాత గణాంకాలు చూసుకుంటే ఇప్పటి వరకు రెండు జట్లు 26 మ్యాచ్లలో తలపడ్డాయి. ఈ క్రమంలోనే పదహారు మ్యాచ్ లు ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే 10 మ్యాచుల్లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఇక మ్యాచ్లో భాగంగా మొదట ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సమయంలో 11 సార్లు విజయం సాధిస్తే ఢిల్లీ క్యాపిటల్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సమయంలో ఐదుసార్లు విజయం సాధించింది. ఇక సెకండ్ బ్యాటింగ్ చేసిన సమయంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు.. ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది సార్లు విజయం సాధించారు. ఈ క్రమంలోనే జరగబోయే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు హాట్ టాపిక్ గా మారింది.