కోహ్లీ జట్టుకు కొత్త జెర్సీ.. ఫోటో వైరల్?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏది అంటే అందరు టక్కున చెప్పేస్తారు కోహ్లీ కెప్టెన్సీ వహించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అని. ఇప్పటివరకు బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.. అటు ఫైనల్ వరకు వెళ్ళింది కూడా చాలా తక్కువే.. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగి పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉంటుంది. కానీ  ప్రస్తుతం ఐపీఎల్లో మిగతా జట్లకు లేని ఫాలోయింగ్ అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంతం.

 అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎప్పుడూ ఒకే రంగు జెర్సీ తో మ్యాచ్ ఆడుతూ ఉంటుంది. కానీ ప్రతి ఏడాది కూడా పర్యావరణాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో మంచి మెసేజ్ ఇవ్వడానికి ఆకుపచ్చ కలర్ జెర్సీ ధరించి ఒక మ్యాచ్ ఆడుతూ ఉండటం చూస్తూ ఉంటాం.  మామూలుగా అయితే ఎరుపు రంగు జెర్సీ లోనే ఆడుతూ ఉంటుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఈసారి ఆకుపచ్చ, ఎరుపు రంగు కాకుండా కొత్త కలర్ జెర్సీ ధరించేందుకు సిద్ధమైంది.

 ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఐపీఎల్ మలిదశలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన తొలి మ్యాచ్లో ఎప్పటిలాగా ఎరుపు రంగు జెర్సీ తో కాకుండా బ్లూ జెర్సీ తో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. దేశంలో కోవిడ్ కట్టడికి ఫ్రంట్లైన్ వారియర్స్ ఎంతగానో పోరాడుతున్నారు. వారికి మద్దతుగా నిలిచేందుకు ఇలా బ్లూ జెర్సీ తో బరిలోకి దిగాలని భావిస్తున్నాము అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలోనే ఫ్రంట్లైన్ వారియర్స్ ధరించే పీపీఈ కిట్ల రంగును సూచించే విధంగా నీలిరంగు జెర్సీ తో బరిలోకి దిగుతా అంటూ తెలిపింది. ఇక రెండవ దశ ఐపీఎల్ సీజన్ లో భాగంగా అటు సెప్టెంబర్ 20వ తేదీన కోల్కత్త జట్టుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మ్యాచ్ ఆడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: