సింధూ స్పీక్స్ : కల నుంచి కల వరకూ

RATNA KISHORE
ఒలంపిక్స్ నుంచి ఒలంపిక్స్ వరకూ
రియో నుంచి టోక్యో వరకూ
తిండి తిప్పలు మానుకున్న రోజు నుంచి
అన్నీ ఇష్టంగా తిన్న రోజు వరకూ
సింధూ.. గురించి.. కాస్త ఆసక్తి
కాస్త శ్రద్ధ కూడా...


అమ్మాయిలకు గెలుపు
అమ్మాయిలదే గెలుపు
అమ్మ గెలుపు నాన్న గెలుపు
ముఖ్యంగా ఆ ఇంటి గెలుపు
దేశం గెలుపు ఫైనల్ వెర్షన్ ఇదే


పతకం ఏదయినా సరే
పట్టించుకోకు ఇది గురువు మాట
నా కోసం పతకం తీసుకు రా చాలు
ఇది నీవు నాన్నకు ఇచ్చిన కానుక
ఇది నాన్న మాట
ఇంటికి చేరుకున్న పీవీ సింధు
అమ్మతో మాట్లాడుతోంది నవ్వులు రువ్వుతోంది
కొన్ని మాటలు రేపటిని ప్రభావితం చేయవచ్చు
ఆ క్రమంలో సింధూ  వాట్స్ టు సెటిల్డ్ ఇన్ హెర్
పర్సనల్ లైఫ్


ఇప్పటికిప్పుడు గోపీ చంద్ అకాడమీకి అర్జీలు పెరగకపోవచ్చు. ఇప్పటికిప్పుడు వెయిట్ లిఫ్టింగ్ కోసం జిమ్ సెంటర్ల దగ్గర క్యూ పెరగకపోవచ్చు..ఇప్పటికిప్పుడు బాక్సింగ్ కోసం ఆరాట పడే వారి జాబితా పెరగకపోవచ్చు.. ఏవీ ఇప్పటికిప్పుడు మారవు. కానీ మారేందుకు ఓ అవకాశం ఈ ఒలంపిక్స్ ఇచ్చింది. సింధూ,మీరా చాను, లవ్లీనా ఇలా అంతా ఇప్పుడు మోటివేషన్ క్లాసెస్ కు సిలబస్. ఇంటి పట్టున ఉండే ఆడబిడ్డలకు తిరుగుబాటు నేర్చే అడవి బిడ్డలకు ఈ పాఠం అవసరం. నేర్చుకోవాలి. ఒక సారి ఓడిపోతే ఏం కాదు.. అన్నది ఒంటికి పట్టించుకోవాలి..అలానే మరికొన్ని విషయాలకు సింధు చెప్పే మాటలు స్ఫూర్తి ఇవ్వాలి. చిన్న నాటే తనకు తాను ఫిక్స్ చేసుకున్న గోల్ ఒకటి ఉంది అని అమ్మ చెబుతున్నారు. అదే నిజం.. ఆ గోల్ ను ఎలా అయినా సాధించాలన్న పట్టుదలలో ఆమె ఇప్పటికీ ఉన్నారు. ఫిటెనెస్ పోతే ఏడ్చేస్తారు ఆమె.. తన తడబాటును ఎవ్వరిపైనో తప్పిదం గా అకారణ నెపం నెట్టరు.అలానే తాను ఆడుతున్నంత సేపు దేశం కోసం భవిష్యత్ కోసం ఆడుతున్నానన్న స్పృహ చాలు ఆమెలో కొత్త ఉత్సాహం వచ్చేందుకు.. ఇవన్నీ వినాలంటే మనసుంటే చాలు..పాటించాలన్నా మనసుంటే చాలు.. సింధూ మనసు గెలుచుకోవాలన్నా మనసుంటే చాలు.. చాల్లే ఛాదస్తం అనకండి ఇదే మాట సింధూనే చెబుతోంది. వచ్చేవాడికి మనసుంటే చాలు..మనం చేసే పనులు మనసు పెట్టి చేస్తే చాలు.. ఇవే గెలుపునకు ప్రాథమిక సూత్రాలు. వీటిని మించి మరికొన్నీ ఉన్నాయి. తన కల నుంచి కల వరకూ సాధించాల్సినవి ఉన్నాయని చెబుతోంది. ప్యారిస్ మాట దేవుడెరుగు ఈ విజయంను ఆమెకు ఎంజాయ్ చేయనివ్వండయ్యా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: