విజేత ఇప్పుడు కానీ : ఓ అమ్మాయి ఓ అవమానం
నీవు గోల్డ్.. నీవు విన్నర్
ఈ రెండు మాటలు విన్నారా ఎప్పుడయినా
ఇండియాలో ఆటలకు ఆదరణ ఉండదు
ఉన్నా కొద్దిపాటి ప్రోత్సాహమే
ఇవి విని విని విసుగెత్తితే మీరు ఈ విజయాన్ని
ఆస్వాదించలేరు.. ఏమీలేని రోజున మీకు గుర్తుకు వచ్చే
విజయాలు ఈ మారుమూల ప్రాంతాలకు చెందిన
ఆడబిడ్డలవి.. అవి మాత్రమే వినండి చదవండి
మణిపూర్ అడవులకు కొండలకూ కోనలకూ ఆమె తెలుసు.. కట్టెలు మోయడం,. సరైన పోషకాహారం లేకపోవడం ఆమెకు తెల్సు..తాను కష్టపడితే వచ్చే గెలుపు విలువ కూడా తెల్సు.. ఆమె మీరాబాయి చాను.. మీరంతా చప్పట్లు కొడుతున్న ఒలంపియన్.. రేపు గోల్డ్ వస్తుందో లేదా అన్నది కాదు ఇవాళ గోల్డెన్ డ్రీమ్స్ ఉన్నాయా లేవా అన్నది కదా కీలకం.. మట్టి నుంచి వచ్చిన బిడ్డల గెలుపు ఈ దేశానికి ఆదర్శం అయి తీరుతుంది. శ్రీకాకుళం నుంచి ఓ ప్రశంస అలానే మరో ఊరి నుంచి మరో ప్రశంస .. ఈ దేశానికి గ్రామీణ యువతకు సంకల్పం ఉంటేనే రాణిస్తాం అనుకునే వారికి ఆమె విజయం స్ఫూర్తి..
ఆదర్శవంతం అయిన గమనం
ఈ రెండే కావాలి
నడపాలి కాలం చెంత గెలవాలి
ఓడిపోతే నవ్వుతారు..ఓడిన చోట అవమానిస్తారు.. విజయం వచ్చాకనో వరించాకనో కేవలం అప్పుడు చప్పట్లు వినిపిస్తాయి.. అప్పుడు మాత్రమే గెలుపు వినిపిస్తుంది..అందాక చేసే ప్రయాణంలో మీరు ఓడిపోతూనే ఉండాలి.. ఇవాళ ఒలంపియన్ జీవితం అందుకు మినహాయింపు అని అనుకోలేం..అనుకుంటూ సాగించే ప్రస్థానం ఆపేయలేం..ఆమె గెలుపు చరిత్రకో పాఠం.. ఆమె ఓటమి కూడా పాఠమే కావాలి.. రియోలో ఓడిపోయాక ఆమె ఇంటికి వచ్చారు గాయాలతో వచ్చారు.. అప్పటి నుంచి ప్రతిరోజూ సాధనకు ప్రాధాన్యం ఇచ్చారు.. టోక్యో లో విజయం వరించాక దేశం ఆమె పేరు స్మరిస్తుంది.