2020 టోక్యో ఒలింపిక్స్ ముఖ్యాంశాలు..

Divya
2020 సంవత్సరానికి గాను టోక్యోలో ఒలంపిక్ క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు శుక్రవారం పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్లో భారత పురుషులు నిరాశ చెందారు అని చెప్పవచ్చు. మొత్తం ఆర్చరీ క్రీడలో 64 మంది పురుషులు పాల్గొనగా ,అటన్ దాస్ 35 వ స్థానంలో నిలవగా ,ప్రవీణ్ యాదవ్ 31వ స్థానంలో నిలిచాడు. ఇక మహిళల విభాగంలో భారత దేశానికి చెందిన దీపిక కుమారి 9వ స్థానంలో నిలిచింది.
మిక్స్డ్ టీం ఎంట్రీ జాబితాపై భారత్ 9వ స్థానంలో నిలబడింది. ఇక పురుష మహిళా విభాగంలో దీపికా కుమారి అలాగే ప్రవీణ్ జాదవ్ ఇద్దరూ కలిసి 1319 పాయింట్లు సాధించడం జరిగింది. అయితే రేపు అనగా జులై 24 వ తేదీ శనివారం ఎలివేషన్ రౌండ్లో  దీపిక ఎవరితో జతకట్ట నుందో వేచిచూడాలి మరి. అయితే ఇక్కడ వినిపిస్తున్న వార్తలు సమాచారం ప్రకారం , అటన్ దాస్ తో భాగస్వామిగా జత కట్టవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఆర్చరీ మిక్స్డ్ టీం ఎంట్రీ విభాగంలో 1368 పాయింట్లను గెలుపొంది, కొరియా దేశం మొదటి స్థానంలో నిలవగా, 1350 పాయింట్లతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. ఇక పురుషుల భాగంలో అటన్ దాస్ 653 పాయింట్లతో ముగించగా, ఇక ప్రవీణ్ జాదవ్ 656 పాయింట్లు సాధించి, అటన్ దాస్  కంటే రెండు పాయింట్లతో ఎక్కువ స్థానంలో నిలిచాడు. ఇక ప్రవీణ్ జాదవ్ ఉత్తమ భారతీయ విలు కారుడిగా31వ స్థానంలో నిలిచాడు.

ఇక 40వ దశకంలో ఆర్చరీ విభాగంలో కొట్టుమిట్టాడుతున్న తరుణ దీప్ రాయ్ 37వ స్థానంలో నిలిచి , రెండవ అర్ధ భాగంలో మెరుగుపరిచారు. ఇక రెండవ విభాగంలో కూడా మంచి విలుకారిడిగా గుర్తింపు పొందాడు. ఇక పూర్తిగా ర్యాంకింగ్ రౌండ్ ముగిసే సరికి అటన్ దాస్ 35 వ స్థానంలో నిలవగా, ప్రవీణ్ 31వ స్థానంలో నిలిచారు. తరుణ దీప్ రాయ్ 37 స్థానానికి చేరుకున్నాడు. అయితే ఈ ఆర్చరీ విభాగంలో మహిళల విభాగంలో రేపటి కోసం ఎదురు చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: