ఒలంపిక్స్ పై కరోనా పడగా.. పెరుగుతున్న కేసులు?

praveen
నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆటల పండుగ ఒలంపిక్స్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ప్రతి ఒక క్రీడాకారుడు లక్ష్యం ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యం అన్న విధంగా ఉంటుంది. ఒలంపిక్స్ లో అవకాశాన్ని దక్కించుకుని తమ దేశం తరఫున పథకం సాధించడానికి ఎంతో మంది ఎన్నో ఏళ్ల నుంచి కష్ట పడుతూ ఉంటారు.  వాస్తవానికి అయితే ఒలంపిక్స్ మెగా టోర్నీకి గత ఏడాది జరగాల్సి ఉంది.  కానీ కరోనా వైరస్ కారణంగా ఒలంపిక్ టోర్నీ వాయిదాపడుతూ వచ్చింది.ఈ క్రమంలోనే ఒలంపిక్స్  జరుగుతుందా లేదా అని అనుకున్నారు అందరు.  ఇక ఒలంపిక్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న జపాన్ ప్రభుత్వం ఇటీవల టోక్యో ఒలంపిక్స్ కి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.


 అయితే ప్రస్తుతం కరోనా వైరస్  పరిస్థితుల్లో అటు ఒలంపిక్స్ నిర్వహించడం అటు ప్రభుత్వానికి ఒక సవాలుగానే మారిపోయింది.  ఎందుకంటే అన్ని దేశాల నుంచి క్రీడాకారులు వారి వెంట సిబ్బంది కూడా వస్తూ ఉంటారు. ఇక వారికి ప్రత్యేకంగా రక్షణ కల్పించాల్సిన  అవసరం ఉంటుంది. కఠినమైన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది.  మరోవైపు ఎలాంటి ప్రేక్షకులు లేకుండానే ఒలంపిక్ నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎంతో మంది క్రీడాకారులు సైతం ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జూలై 23 నుంచి ప్రారంభం కాబోయే ఒలింపిక్స్ కోసం ఇక ఇప్పటికే జపాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది.

 అయినప్పటికీ ఒలింపిక్స్ ఫై కరోనా పొంచి ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు.  ప్రస్తుతం ఒలంపిక్స్ మెగా టోర్నీకి ప్రాతినిధ్యం వహిస్తున్న టోక్యో నగరంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ఇది కాస్త ఆందోళన కరంగా మారిపోయింది   ఇప్పటికే జపాన్ ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ విధించింది. 25 రోజుల నుంచి కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇటీవలే బుధవారం రోజున కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏకంగా ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంకోవైపు ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఒలంపిక్స్ నిర్వహించేందుకు ఇప్పటికే క్రీడాకారులు  సహా వారి సిబ్బంది కోచ్ లకు కూడా కరోనా టీకా  ఇచ్చే ప్రక్రియను 80 శాతం పూర్తి చేసింది జపాన్ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: