గుడ్ న్యూస్ : భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ లకు ప్రేక్షకులు?

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇక తమ అభిమాన జట్టును ఎంకరేజ్ చేయడానికి ప్రేక్షకులు  అందరూ స్టేడియంలో నిండి పోతూ ఉంటారు.  ఈ క్రమంలోనే తమ అభిమాన ఆటగాడు రాణిస్తున్నాడు అంటే ఈలలు గోలలతో హోరెత్తి పోతూ ఉంటారు.  క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే స్టేడియంలో ప్రేక్షకులు చేసే సందడి అంతా ఇంతా కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ కరోనా వైరస్ వచ్చిన తర్వాత స్టేడియంలో ప్రేక్షకుల సందడి కరువైంది.  క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో కాస్త ఉత్సాహాన్ని నింపేందుకు చివరికి ప్రేక్షకులు ఉన్నట్లుగా సౌండ్ పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇలా కరోనా వైరస్ కారణంగా స్టేడియానికి ప్రేక్షకులను అనుమతించడం లేదు.

 అదే సమయంలో ఇక ఆటగాళ్లను బయో బబుల్ పద్ధతిలో ఉంచి మ్యాచులు నిర్వహిస్తున్నాయ్ అన్ని దేశాల క్రికెట్ బోర్డులు.  దీంతో క్రికెట్ ప్రేక్షకులు ఒకప్పటిలా స్టేడియం కి వెళ్లి మ్యాచులను వీక్షించటం కాదు కేవలం కేవలం టీవీల ముందు కూర్చుని వీక్షించే పరిస్థితి వచ్చింది.  ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతి ఇస్తారా అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే పలుమార్లు కీలక మ్యాచ్ లలో  స్టేడియాలు లకు ప్రేక్షకులను అనుమతించాలని అనుకున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య చివరికి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

 ఇక ఇప్పుడు త్వరలో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ప్రేక్షకులను అనుమతించేందుకు నిర్ణయించుకుందట ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఇటీవలే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మ్యాచ్ కి ప్రేక్షకులు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. మరికొన్ని రోజులలో జరగబోయే ఇంగ్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోబోయే అవకాశం ఉంది.  పరిస్థితులు ఇలాగే కొనసాగితే అటు భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు కూడా ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఇది ప్రేక్షకులకు గొప్ప శుభవార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: