ధోని సిక్సర్ల రికార్డుపై.. కన్నేసిన కివీస్ ఫాస్ట్ బౌలర్?
అయితే ధోని సిక్సర్ల రికార్డు పై కన్నేసింది బ్యాట్స్‌మెన్ కాదు.. ఫాస్ట్ బౌలర్. మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ ఫార్మాట్ లో నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఒక ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం భారత్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ మహేంద్ర సింగ్ ధోనీ సిక్సర్ల రికార్డు కే ఎసరు పెట్టినట్లు కనిపిస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లాండులోని సౌథాంప్టన్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్లు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఆడుతున్నాయి.
ఇకపోతే ఇటీవల బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ రెండు సిక్సర్లూ ఒక ఫోర్ సహాయంతో 30 పరుగులు చేశాడు 46 బంతుల్లో 30 పరుగులు చేసి ఇక జట్టుకు మంచి స్కోరు అందించాడు. చివరికి జడేజా బౌలింగులో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు టిమ్ సౌతీ అయితే మ్యాచ్‌లో 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని న్యూజిలాండ్ సాధించడానికి ఇక సౌదీ దూకుడు ఇన్నింగ్స్ కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం బౌలింగ్ లో మాత్రమే కాదు అటు బ్యాటింగ్‌లో కూడా టిమ్ సౌతీ జట్టుకు ఎన్నో సార్లు విజయం అందించాడు.
గతంలో చాలా సందర్భాల్లో టిమ్ సౌతీ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో దూకుడుగా ఆడి భారీ స్కోర్లు కూడా చేశాడు. ఇప్పుడు వరకు 79 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన 87.74 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. ఇక 1728 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయ్. 167 ఫోర్లు, 75 సిక్సర్లు ఉన్నాయి. అయితే తన కెరీర్లో 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మహేంద్రసింగ్ ధోని 78 సిక్సర్లు కొట్టాడు అయితే ఇప్పటి వరకు 75 సిక్సర్లు కొట్టిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ ఇక మరో నాలుగు సిక్సర్లు కొట్టాడు అంటే ధోని రికార్డును బ్రేక్ చేస్తాడు. కాగా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ ఉన్నాడు.