విడాకులు తీసుకున్న మ‌హిళ‌ల్నిపెళ్లి చేసుకున్న 5 క్రికెట‌ర్లు వీళ్లే..!

Suma Kallamadi
ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో పెండ్లి అనేది ఒక ముఖ్య‌మైన భాగం. దాని కోసం ప్ర‌తి ఒక్క‌రూ ఎన్నో క‌ల‌లు కంటారు. త‌మ భాగ‌స్వామి ఇలా ఉంటే బాగుంటుంద‌ని ఎవ‌రికైనా ఎన్నో ర‌కాల అంచ‌నాలు ఉంటాయి. అయితే ఎవ‌రి అవ‌స‌రాల‌కు త‌గ్గట్టు వారు పెండ్లి చేసుకుంటారు. అందులో ఎవ‌రి ఇష్టం వారిది. అయితే మ‌న సెల‌బ్రిటీల విష‌యంలో కూడా పెండ్లి అనే టాపిక్ ఎప్పుడూ కొత్త‌గానే ఉంటుంది. వారు చేసుకునే పెండ్లిల‌పై అభిమానుల‌కు కూడా ఎన్నో ర‌కాల ఊహాగానాలు అనేవి స‌హ‌జం అనే చెప్పాలి.


ఇక మ‌న ఇండియ‌న్ క్రికెట‌ర్లు కూడా పెండ్లిళ్ల విష‌యంలో ప్ర‌త్యేకంగా నిలిచారు. మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే పెండ్లి అయి విడాల‌కు తీసుకున్న మ‌హిళ‌ల‌ను కూడా మ‌న క్రికెట‌ర్లు వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి వారి గురించి తెలుసుకుందాం. గ‌బ్బ‌ర్ క్రికెట‌ర్ శిఖర్ ధావన్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయేషా తనకంటే వయసులో పదేళ్లు పెద్దదైనప్ప‌టికీ శిఖ‌ర్ ఎంతో ఇష్ట‌ప‌డి మ‌రీ చేసుకున్నాడు. అప్ప‌టికే ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నా మ‌నోడు పెండ్లి చేసుకున్నాడు.


ఇక ముర‌ళీ విజ‌య్ కూడా త‌న ఫ్రెండ్ దినేష్ కార్తీక్ భార్య నికిత తోఏకంగా  అక్రమ సంబంధం పెట్టుకుని మ‌రీ చివ‌ర‌కు పెండ్లి చేసుకున్నాడు. దీంతో దినేష్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇక వీరిలాగే మహ్మద్ షమీ కూడా పెండ్లి అయిన హసీనాకు తాళి క‌ట్టాడు. అయితే వీరిద్ద‌రూ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఇక బౌల‌ర్ అనిల్ కుంబ్లే అంద‌రిలాగే ఓ పెళ్లి అయ్యి కూతురు ఉన్న చేతనను ఎంతో ఇష్ట‌ప‌డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.


ప్ర‌స్తుతం అనిల్ కుంబ్లేకు ఇద్ద‌రు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. ఇక వీరంద‌రి దారిలోకే వ‌స్తాడు ఇండియన్ మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ అనే ఫేమ‌స్ క్రికెట‌ర్‌. ఈయ‌న కూడా 1997 లో జయంతి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని వార్త‌ల్లో నిలిచారు.


 అయితే అప్పటికే జయంతి భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంట‌రిగా ఉండ‌టంతో ప్ర‌సాద్ ఆమెను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఈమెను అనిల్ కుంబ్లే ద్వారా ప్రసాద్ పెండ్లి చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఇలా మ‌న క్రికెట‌ర్లు ఆల్రెడీ పెండ్లి అయిన అమ్మాయిల‌ను పెండ్లి చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: