బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీరౌతేలా క్రికెటర్ రిషబ్ పంత్ తో ప్రేమలో ఉన్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఊర్వశి ఇన్స్టాగ్రామ్ లైవ్ ఫ్యాన్స్ తో ముచ్చటించింది. అయితే ఓ నెటిజెన్ ఊర్వశి ని మీ అభిమాన క్రికెటర్ ఎవంటూ ప్రశ్నించగా అసలు తాను క్రికెట్ చూడనంటూ సమాధానం ఇచ్చింది. క్రికెట్ చూడనంటూనే తనకు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ అంటూ సమాధానం ఇచ్చింది. అయితే అప్పట్లో ఊర్వశి క్రికెటర్ రిషబ్ పంత్ తో ప్రేమలో ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి. వీరిద్దరు ఓ హోటల్ లో కలిసి డిన్నర్ చేశారు. ఇక ఆ ఫోటోలు బయటకు రావడంతో ఊర్వశి రిషబ్ పంత్ ప్రేమలో ఉన్నారని టాక్ వినిపించింది. అయితే ఊర్వశి చేసిన తాజా వ్యాఖ్యలతో ఇద్దరూ విడిపోయారని అర్థమవుతుంది. ఇదిలా ఉండగానే రిషబ్ పంత్ తన కొత్త గర్ల ఫ్రెండ్ ప్రముఖ మోడల్ ఇషా నేగి తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఊర్వశికి బ్రేకప్ చెప్పి రిషబ్ తన కొత్త ప్రేయసి తో తిరుగుతున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
అంతే కాకుండా ఇటీవలే ఊర్వశీ వాట్సాప్ ను కూడా రిషబ్ పంత్ బ్లాక్ చేశారని..దాంతో ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అయ్యిందని కూడా టాక్. ఇక పంత్ తన గర్ల్ ఫ్రెండ్ తో పెట్టిన పోస్ట్ లో తాను ఇషాను ఎంతలా ప్రేమిస్తున్నాడో చెప్పేశాడు. నిన్ను నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలనుకుంటున్నా...ఎందుకంటే నేను నీవల్లే సంతోషంగా ఉన్నా. అంటూ పంత్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. దాంతో రిషబ్ పంత్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇషా కూడా రిషబ్ పై తనకు ఉన్న ప్రేమను చాటుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నువ్వే నా మగాడివి..నువ్వే నా ఆత్మ...నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ వి..నా జీవితానికి నువ్వే ప్రేమవంటూ పేర్కొంది. ఇక ఇటీవలే ఇటీవలే ఇషా డిగ్రీ పొందింది ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనర్ గా చేస్తుంది.