ఒక్క సెంచరీ లేదు కానీ.. అర్థ సెంచరీలతో రికార్డు కొట్టాడు

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి క్రికెటర్‌కు సెంచరీలు, హాఫ్ సెంచరీలు కొట్టాలని కలలు కంటుంటారు. కానీ ప్రతి సారీ సెంచరీలు బాదలేరు. అయితే కెరీర్ ముందుకెళుతున్న కొద్దీ కొన్ని సెంచరీలతో పాటు అర్థ సెంచరీలు కూడా తమ నమోదు చేస్తుంటారు. అయితే కెరీర్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా అన్నీ అర్థ సెంచరీలే కొడితే..? అది నిజంగా కొంత విచిత్రంగానే ఉంటుంది. అయితే తాజాగా శ్రీలంకకు చెందిన ఓ యువ క్రికెటర్ ఇలాంటి రికార్డే సాధించాడు. టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా కొట్టకుండా ఏకంగా 17 సెంచరీలు సాధించాడు. దీంతో ఇప్పటివరకు ఈ విభాగంలో ప్రపంచ రికార్డును సైతం బద్దలు కొట్టాడు.

వెస్టిండీస్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అందులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్‌వెల్లా విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. అయితే 96 పరుగుల వద్ద కీమా రోచ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో టెస్టుల్లో అతడి 17వ అర్థ సెంచరీ పూర్తయింది. దీంతో ఏకంగా ఓ వరల్డ్ రికార్డును సైతం డిక్‌వెల్లా బద్దలు కొట్టాడు. అదేటంటే టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా అన్ని అర్థ సెంచరీలు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇండియన్ బ్యాట్స్‌మన్ చేతన్ చౌహాన్ పేరున ఉండేది. అతడు ఒక్క సెంచరీ కూడా లేకుండా 16 అర్థ సెంచరీలు సాధించాడు.

ఇదిలా ఉంటే విండీస్‌-శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక దారుణంగా 169 పరుగులకే ఆలౌటైంది. కాగా.. విండీస్ 271 పరుగులు చేసి 102 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ధాటిగా ఆడి ఏకంగా 476 పరుగులు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ 236 పరుగులు చేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: